ఐపీఎల్ లో ఇవాళ లక్నో సూపర్ జెయిట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ సీజన్ లో లక్నో టీమ్ మూడు మ్యాచ్ లు ఆడగా. ఆర్సీబీ రెండు మ్యాచ్ లు ఆడింది. ఇక్కడ ఒక మ్యాచ్ లో విజయం, మరో మ్యాచ్ లో ఓటమిని ఆర్సీబీ ఎదుర్కొవాల్సి ఉంది. లక్నో తన తొలి మ్యాచ్ లో ఢిల్లీని ఘోరంగా ఓడించింది. ఆ తర్వాత రెండో మ్యాచ్ లో చెన్నై చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. మూడో మ్యాచ్ లో ఈ జట్టు ఏకపక్షంగా సన్ రైజర్స్ ను ఓడించింది. మరో వైపు ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఆ తర్వాత రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 81 పరుగుల ఘోర పరజయాన్ని చవిచూసింది.
Also Read : Pawan Kalyan: ‘రీరిలీజ్’కి ‘ప్రీరిలీజ్’ ఈవెంటా? పవన్ ఫాన్స్ అంటే మినిమమ్ ఉంటది
నేటి మ్యాచ్ లో ఆర్సీబీ తిరిగి విన్నింగ్ ట్రాక్ లోకి రావాలనుకుంటుంది. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ జట్టులో చేరడం.. అతను నేటి మ్యాచ్ ఆడడం ఆర్సీబీ కి కలిసొచ్చే విషయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ సొంత మైదానంలో తిరిగి విన్నింగ్ ట్రాక్ లోకి రావాలనే ఉద్దేశంతో మైదానంలోకి దిగుతుంది. కేకేఆర్ పై స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగిన బ్యాటింగ్ ఆర్డర్ లో ఘోరంగా విఫలమైంది. బ్యాటింగ్ లోనే కాదు.. గత మ్యాచ్ లో బెంగళూరు బౌలర్లు కూడా తమ ప్రదర్శనతో నిరాశపరిచారు. సిరాజ్, హర్షల్ పటేల్ భారీగా పరుగులు ఇవ్వగా.. ఆకాష్ దీప్,మైఖేల్ బ్రేస్ వెల్ కూడా పరుగులు సమర్పించుకున్నారు.
Also Read : Ponguleti, Jupally Suspension Live: పార్టీ నుంచి పొంగులేటి, జూపల్లి సస్పెన్షన్
అయితే రీస్ టాప్లీ స్థానంలో వచ్చిన వేన్ పార్నెల్ కు ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం ఇవ్వవచ్చు. గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ అద్బుతంగా రాణించింది. కృనాల్ పాండ్యా బంతితోనూ, బ్యాటింగ్ లోనూ విధ్వంసం సృష్టించాడు. అదే సమయంలో సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా తన స్పిన్ ఉచ్చులో హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ను దారుణంగా తికమక పెట్టడంలో సక్సెస్ అయ్యాడు. లక్నో తరపున ఇప్పటి వరకు జరిగిన టోర్నీలో కైల్ మేయర్స్ బ్యాట్ తో అత్యద్యుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్ రాహుల్ కూడా హైదరాబాద్ పై మంచి టచ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. ఎస్ ఆర్ హెచ్ పై కేఎల్ రాహుల్ 35 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా 23 బంతుల్లో 34 పరుగులు చేశాడు.
