Site icon NTV Telugu

West Indies : అరవీర భయంకర హిట్టర్లతో… టార్గెట్ 2027 వరల్డ్ కప్!

West Indies Squd

West Indies Squd

గత వన్డే ప్రపంచకప్ కు అర్హత కోల్పోయిన వెస్టిండీస్ 2027 వరల్డ్ కప్ కోసం సిద్దమవుతుంది. వెస్టిండీస్ త్వరలో యూరప్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐర్లాండ్ , ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకోసం తాజాగా 15 మంది సభ్యులతో కూడిన వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్ గెలవడం వెస్టిండీస్ కు చాలా అవసరం. 2027 ఐసిసి వన్డే ప్రపంచ కప్ కోసం తమ సన్నాహాల్లో భాగంగానే ఈ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ హిట్టర్లను బరిలోకి దింపుతోంది.

Read Also : Barrelakka: “నాకు పెళ్లైన సంతోషం కూడా లేదు” బర్రెలక్క వీడియో వైరల్..

బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కేసీ కార్టీ వంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌లను జట్టులో చేర్చగా, 19 ఏళ్ల జ్యువెల్ ఆండ్రూ తొలిసారి వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న షిమ్రాన్ హెట్మెయర్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. గత ఏడాది చివర్లో బంగ్లాదేశ్‌పై మూడు సున్నాతో సిరీస్‌ను గెలుచుకున్న జట్టులో భాగమైన ఆటగాళ్లకే తాజా జట్టులో చోటు దక్కింది. బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్‌ తో జరిగిన సిరీస్ లోనూ విండీస్ దే విజయం. ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లతోనే వెస్టిండీస్ ను బలమైన జట్టుగా మార్చాలనుకుంటున్నాడు ప్రధాన కోచ్ డారిన్ సామీ. వెస్టిండీస్ మునుముందు కఠిన సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా, భారత్ లాంటి బలమైన జట్లను ఎదుర్కోవాలంటే వెస్టిండీస్ మరింత చమటోడ్చాల్సిందే. కాగా తాజాగా ప్రకటించిన విండీస్ జట్టులో షాయ్ హోప్ , జ్యువెల్ ఆండ్రూ, కేసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, అల్జారి జోసెఫ్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్ ఉన్నారు.

Read Also : Catherine Tresa : ‘మెగా’ ఆఫర్ కొట్టేసిన బన్నీ హీరోయిన్..

Exit mobile version