Site icon NTV Telugu

Kohli vs MS Dhoni: విరాట్ కోహ్లీ ఇబ్బంది పడ్డాడు.. ధోనీ మాత్రం పట్టించుకోలేదు..!

Dhoni

Dhoni

Kohli vs MS Dhoni: భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ ఇద్దరూ మంచి స్నేహితులు గత రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన హీరోలు. కోహ్లీ కన్నా ధోనీ కొన్నేళ్ల ముందే జాతీయ జట్టులోకి అడుగు పెట్టినా, ఇద్దరి మధ్య ఉన్న దోస్తీ అందరిని ఆకట్టుకుంటుంది. కాగా, కోహ్లీ 2022 జనవరిలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు, తనకు మెసేజ్ చేసిన ఏకైక ఆటగాడు ధోనీ మాత్రమేనని కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. ఇక, 2014లో భారత్- కివీస్ టెస్ట్ సిరీస్ సందర్భంగా కోహ్లీ, ధోనీ గురించి ఆసక్తికరమైన సంఘటనను న్యూజిలాండ్ పేసర్ నీల్ వాగ్నర్ గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో తన బౌన్సర్లకు కోహ్లీ, ధోనీ ఇచ్చిన విభిన్న ప్రతిస్పందనలు తాను ఇప్పటికీ మరిచిపోలేనని అన్నాడు.

Read Also: Balapur Ganesh : బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న తెలుగు హీరో..

వాగ్నర్ చెప్పిన ఆసక్తికర సంఘటన
ఇక, నీల్ వాగ్నర్ మాట్లాడుతూ: ఆ టెస్ట్ మ్యాచ్‌లో పిచ్ బాగా ఫ్లాట్‌గా ఉంది.. కొంత పేస్, బౌన్స్ ఉన్నా.. నేను కొన్ని బౌన్సర్లు వేసినప్పుడు కోహ్లీ కొంత ఇబ్బంది పడ్డాడు.. అతనికి ఎలా స్పందించాలో తెలియలేదు.. ఒకసారి పుల్ షాట్ ఆడే క్రమంలో బ్యాట్ ఎండ్ తగిలి కీపర్ చేతికి వెళ్ళిందన్నాడు. అయితే, అదే సమయంలో ధోనీ, జడేజాలు నా బౌలింగ్‌పై దూకుడుగా వ్యవహరించారని పేర్కొన్నాడు. ఇక, ధోనీ మాత్రం ఏమాత్రం ఆందోళన చెందలేదు.. ఎప్పటిలాగే పాజిటివ్‌గా, అగ్రెసివ్‌గా ఆడాడు.. నేను ఒకసారి స్లో బౌన్సర్ వేశాను, దానికి ఎంఎస్ బౌల్డ్ అయ్యాడు అని వాగ్నర్ చెప్పుకొచ్చాడు.

Read Also: OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

బీసీసీఐపై విమర్శలు
అయితే, ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పుజారాలు లు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ.. బీసీసీఐ, ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ లోపం ఉందని ఆరోపించారు. 100 టెస్టులు ఆడిన ప్లేయర్ తప్పకుండా ప్రత్యేకమైన క్రికెటర్.. అతనికి గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలి అని సూచించారు. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌ విషయంలో బీసీసీఐ సమన్వయం చేయలేదు.. ఇది మంచి పద్ధతి కాదు అని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీకి ఇంకా రెండు సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ మిగిలి ఉంది.. అతనికి సరైన వీడ్కోలు ఇవ్వాల్సింది అని కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.

Exit mobile version