Site icon NTV Telugu

Cristiano Ronaldo: రోనాల్డో అత్యాచారం కేసు.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు

Ronaldo

Ronaldo

ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు కోర్టులో భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. 2009లో లాస్ వెగాస్ లోని ఒక హోటల్ లో తనపై రోనాల్డో అత్యాచారం చేసినట్లు కేత్రిన్ మోయెర్గా అనే మహిళ కోర్టులో వేసింది. అప్పటినుంచి ఈ కేసు కోర్టు విచారిస్తూనే ఉంది.

ఇక తాజాగా ఈ కేసుపై న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. బాధితరాలు తరపున వాదనలు వినిపించిన లాయర్ సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయాడని తెలుపుతూ రొనాల్డో అత్యాచార కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రోనాల్డోకు భారీ ఊరట లభించింది. ఇక రోనాల్డో ఇటీవల తన పోర్చుగల్ టీమ్ తో కలిసి ఖతర్ వేదికగా జరిగనున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ కు అర్హత సాధించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇదే క్రిస్టియన్ ఇదే ఆఖరి ఫిఫా వరల్డ్‌కప్‌ కావొచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది

Exit mobile version