Site icon NTV Telugu

మహిళల ప్రపంచకప్: భారత జట్టు ప్రకటన.. దాయాదుల మధ్యే తొలి సమరం..

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022తో పాటు న్యూజిలాండ్‌తో జరగనున్న, వన్డే సిరీస్‌తో పాటు ఏకైక టీ20కి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ.. న్యూజిలాండ్‌తో జరిగే ఏకైక టీ20కి హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలి, యాస్తిక, దీప్తి, రిచా(వికెట్‌ కీపర్‌), స్నేహ రాణా, పూజ, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా (వికెట్‌ కీపర్‌), రాజేశ్వరి, పూనమ్, ఏక్తా, ఎస్‌. మేఘన, సిమ్రాన్ దిల్ బహదూర్ పేర్లను ఖరారు చేశారు.. ఐసీసీ మహిళల ప్రపంచకప్​ 2022 కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించిది బీసీసీఐ.

Read Also: సుప్రీంకోర్టుకు ప్రధాని మోడీ పర్యటన వ్యవహారం..

మహిళల ప్రపంచకప్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్​కీపర్​), స్నేహ్​ రాణా, జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్​కీపర్​), రాజేశ్వరి గైక్వాడ్​, పూనమ్ యాదవ్ పేర్లను ప్రకటించారు.. ఇక, స్టాండ్​ బై ప్లేయర్స్​గా సబ్బినేని మేఘన, ఏక్తా బిష్త్​, సిమ్రాన్​ దిల్​ బహదూర్ ను ఎంపిక చేశారు.. న్యూజిలాండ్‌లో ఈ మార్చిలో మహిళల వన్డే ప్రపంచకప్​జరగనుంది.. మార్చి 4వ తేదీన ప్రారంభంకానున్న ఈ మెగాటోర్నీలో టీమ్​ఇండియా తన తొలి మ్యాచ్‌ను మార్చి 6వ తేదీన ఓవల్​ వేదికగా దాయాది పాకిస్థాన్‌తో తలపడబోతోంది.. ఇకచ మార్చి 10న న్యూజిలాండ్‌తో, 12న వెస్టిండీస్, 16న ఇంగ్లాండ్, 19న ఆస్ట్రేలియా, 22న బంగ్లాదేశ్, 27న దక్షిణాఫ్రికాతో గ్రూప్​ స్టేజ్‌లో ఆడనుంది..

Exit mobile version