Site icon NTV Telugu

T20 World Cup Umpires List: టీ20 వరల్డ్‌కప్‌కు అంపైర్ల టీమ్ రెడీ.. భారత్- పాక్ మ్యాచ్కి మళ్లీ ఆ ఇద్దరే!

World

World

T20 World Cup Umpires List: ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ మ్యాచ్‌లకు సంబంధించిన అంపైర్ల జాబితాను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరిగే గ్రూప్ దశ మ్యాచ్‌లకు మొత్తం 24 మంది ఆన్‌ఫీల్డ్ అంపైర్లు, ఆరుగురు మ్యాచ్ రిఫరీలు విధులు నిర్వర్తించనున్నారు. ఈ టోర్నీలో అందరి దృష్టిని ఆకర్షించే భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కు అనుభవజ్ఞులైన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, కుమార్ ధర్మసేనలను ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా నియమించారు. కీలక మ్యాచ్‌లను నిర్వహించిన అనుభవం ఉన్న ఈ ఇద్దరి నియామకం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

Read Also: Zohran Mamdani: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరానాయర్ పేరు..

ప్రారంభ మ్యాచ్‌కు ధర్మసేన, వేన్ నైట్స్:
టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్- నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు కుమార్ ధర్మసేన, వేన్ నైట్స్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. వేన్ నైట్స్‌కు ఇది తన తొలి టీ20 ప్రపంచకప్ అనుభవం కాగా, ఈ మ్యాచ్ అతనికి 50వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌గా కానుంది. మరోవైపు ధర్మసేన టీ20 ప్రపంచకప్‌లలో విశేష అనుభవం కలిగిన అంపైర్. ఇప్పటివరకు 37 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు. 2016, 2022 ఫైనల్స్‌కూ సైతం విధులు నిర్వర్తించారు.

భారత్- అమెరికా మ్యాచ్‌కు అంపైర్లు:
అయితే, టోర్నీ ప్రారంభ రోజునే భారత్ మ్యాచ్ అభిమానులను ఆకట్టుకోనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు జరిగే భారత్- అమెరికా మ్యాచ్‌కు పాల్ రీఫెల్, రాడ్ టక్కర్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా నియమితులయ్యారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్- స్కాట్లాండ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు నితిన్ మీనన్, సామ్ నోగాజ్స్కీ అంపైర్లుగా వ్యవహరిస్తారు. నితిన్ మీనన్ ఇటీవల టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్‌కు అంపైర్‌గా పని చేశారు. నోగాజ్స్కీ కూడా గత ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లకు, అందులో భారత్- అమెరికా మ్యాచ్‌కు కూడా విధులు నిర్వర్తించారు. ఇక, సూపర్-8 దశతో పాటు నాకౌట్ మ్యాచ్‌లకు సంబంధించిన అంపైర్లు, రిఫరీల జాబితాను తరువాత ప్రకటిస్తామని ఐసీసీ వెల్లడించింది.

Read Also: Epstein files: రష్యన్ అమ్మాయితో సె*క్స్, బిల్ గేట్స్‌కు STD.. ఎస్‌స్టీన్ ఫైల్స్ సంచలనం..

టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్ అంపైర్లు వీళ్లు:

మ్యాచ్ రిఫరీలు:
* డీన్ కోస్కర్, డేవిడ్ గిల్బర్ట్, రంజన్ మడుగల్లే, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగల్ శ్రీనాథ్

అంపైర్లు:
* రోలాండ్ బ్లాక్, క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గాఫ్‌నీ, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కేటిల్‌బరో, వేన్ నైట్స్, డోనోవన్ కోచ్, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్స్కీ, కేఎన్‌ఏ పద్మనాభన్, అల్లాహుద్దీన్ పాలేకర్, అహ్సాన్ రాజా, లెస్లీ రీఫర్, పాల్ రీఫెల్, లాంగ్టన్ రుసెరే, షర్ఫుద్దౌల్లా ఇబ్నె షాహిద్, గాజీ సోహెల్, రాడ్ టక్కర్, అలెక్స్ వార్ఫ్, రవీంద్ర విమలసిరి, ఆసిఫ్ యాకూబ్..

Exit mobile version