Site icon NTV Telugu

SRH vs LSG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న సన్‌రైజర్స్

Lsg Vs Srh

Lsg Vs Srh

Sunrisers Hyderabad Won The Toss And Chose To Bat: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 10వ మ్యాచ్. ఏకన స్పోర్ట్స్ సిటీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఎస్ఆర్‌హెచ్ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఘోర పరాజయం చవిచూడటంతో.. ఈ మ్యాచ్‌తో ఖాతా తెరవాలని భావిస్తోంది. లక్నో జట్టుపై పైచేయి సాధించి, తొలి విజయం అందుకోవాలన్న కసితో బరిలోకి దిగుతోంది. సన్‌రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్ర్కమ్ తిరిగి రంగంలోకి దిగిన నేపథ్యంలో.. ఎస్ఆర్‌హెచ్‌పై అంచనాలు పెరిగాయి. అతని రాకతో.. బ్యాటింగ్ పరంగా సన్‌రైజర్స్ జట్టు పటిష్టంగా మారిందని చెప్పుకోవచ్చు.

Delhi Capitals: ఆస్ట్రేలియాకు మిచెల్ మార్ష్ జంప్.. ఎందుకో తెలుసా?

ఇక లక్నో విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు, ఒకటి గెలుపొంది, మరొకటి ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న లక్నో.. తన స్థానాన్ని మెరుగుపరచుకోవాలన్న ఉద్దేశంతో, ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని అనుకుంటోంది. గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిపోవడంతో.. ఆ ప్రతీకారాన్ని సన్‌రైజర్స్‌పై తీర్చుకోవాలని భావిస్తోంది. అసలే సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ కాబట్టి.. దీనిని లక్నో జట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దీంతో.. తమతమ లక్ష్యాలతో బరిలోకి దిగుతున్న ఈ రెండు జట్లు, ఎవరు గెలుపొందుతారు? అనేది ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్ పరంగా సన్‌రైజర్స్‌తో పోలిస్తే.. లక్నో జట్టు కొంచెం బలమైనది. కాబట్టి.. స్వల్ప స్కోరుకి లక్నోని కట్టుదిట్టం చేసేలా సన్‌రైజర్స్ ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం.. ఈ మ్యాచ్‌లో ఎవరు సత్తా చాటుతారో?

Wife Kidnap Drama: బోల్తాకొట్టిన కిడ్నాప్ డ్రామా.. అడ్డంగా దొరికిన భార్య

Exit mobile version