Site icon NTV Telugu

IPL 2022 : సన్‌రైజర్స్‌ టార్గెట్‌ 211..

క్రికెట్‌ అభిమానులు ఎంతగానే ఎదురుచూసే ఐపీఎల్‌ సీజన్‌ మొదలైంది. ఈ ఏడాది కూడా ఎంతో ఉత్సాహంతో క్రికెట్‌ అభిమానుల ముందుకు వచ్చేసింది. అయితే పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ రోజు ఐపీఎల్ -2022లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతున్నాయి. అయితే టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బాట్స్‌తో తొలుత బరిలోకి దిగి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ముందు 211 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. రాజస్థాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దేవ్ దత్ పడిక్కల్ (29 బంతుల్లో 41 పరుగులు), షిమ్రోన్ హెట్ మైర్ (13 బంతుల్లో 32 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ జోస్ బట్లర్ 35 పరుగులు, యశస్వీ జైస్వాల్ 20 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ తలో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, రొమెరియో షెఫర్డ్‌ చెరో వికెట్ తీశారు.

Exit mobile version