ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో ముచ్చటగా మూడో విజయం వచ్చి చేరింది. శుక్రవారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగుల స్కోరు సాధించింది. దీంతో సన్‌రైజర్స్ జట్టు ముందు 176 పరుగుల టార్గెట్ నిలిచింది.
అయితే సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 39 పరుగులకే ఆ జట్టు రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 3 పరుగులకే వెనుతిరగ్గా.. కెప్టెన్ విలియమ్సన్ 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి(71), మార్‌క్రమ్ (68) వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లతో రెచ్చిపోయాడు. అతడికి దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ సహకరించాడు. వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీలు చేయడంతో సన్‌రైజర్స్ 17.5 ఓవర్లలోనే విజయం సాధించింది. కోల్‌కతా బౌలర్లలో రసెల్ రెండు వికెట్లు తీయగా కమిన్స్ ఓ వికెట్ సాధించాడు.
