Shreyas Iyer: అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించినప్పటికీ ఆసియా కప్ కు ఎంపిక చేసిన టీమిండియా జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు లభించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్‌కు సారథిగా బాధ్యతలు అప్పగిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ, ఇది సీనియర్ క్రికెట్ జట్టుకు కాదు.. ఇండియా A జట్టు వచ్చే వారం ఆస్ట్రేలియా Aతో రెండు అనధికారిక టెస్టులు ఆడబోతుంది. ఆ టీమ్ కు అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. లక్నోలోని ఏక్‌నా స్టేడియంలో టెస్టులతో పాటు 3 అనధికారిక వన్డేల్లోనూ ఇరు జట్లూ పోటీ పడతాయి. తుది స్క్వాడ్‌ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. కానీ, శ్రేయస్‌కే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తుంది.
Read Also: CM Revanth Reddy : ఆకస్మికంగా ట్యాంక్‌బండ్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
అయితే, ఆసియా కప్‌కు ఎంపిక కాకపోవడంతో శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ యంగ్ స్టార్ బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడేందుకు ట్రై చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 28 బంతుల్లో 25 రన్స్ చేశాడు. మరోవైపు, రుతురాజ్ గైక్వాడ్ (184) భారీ శతకం సాధించాడు. ఇక యశస్వి జైస్వాల్ (4) సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యాడు. దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు సారథిగా వ్యవహరిస్తోన్న శార్దూల్ ఠాకూర్ (64) సైతం అర్థ శతకం బాధేశాడు. ఇక, జగదీశన్, రజత్ పటీదార్ కూడా మంచి ప్రదర్శన చేశారు. దీంతో ఆస్ట్రేలియా Aతో అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసే స్క్వాడ్‌లో వీరికి కూడా అవకాశం దక్కడం ఖాయమేనని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
