NTV Telugu Site icon

స్కాట్లాండ్‌ బ్యాటర్‌ అరుదైన ఘనత…

టి20 ప్రపంచకప్‌ లో ప్రస్తుతం జరుగుతున్న క్వాలిఫైర్స్ లో స్కాట్లాండ్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే స్కాట్లాండ్‌ బ్యాటర్‌ రిచీ బెర్రింగ్టన్‌ అరుదైన ఘనత అందుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌ తరపున అర్థ సెంచరీ మార్క్‌ అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. పపువా న్యూ గినియాతో జరుగిన గ్రూఫ్‌-బి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో రిచీ బెర్రింగ్టన్‌ ఈ ఘనతను అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో 70 పరుగులు చేసిన రిచీ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్‌ బి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 17 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్‌ క్వాలిఫయర్‌ పోటీల్లో వరుసగా రెండో విజయాన్ని అందుకొని సూపర్‌ 12 దశ అర్హతకు మరింత దగ్గరైంది. చూడాలి మరి ఆ సూపర్‌ 12 లోకి ఎవరు వస్తారు అనేది.