ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. మాజీ ఇంగ్లండ్ మహిళా వికెట్‌కీపర్ సారా టేలర్ను ఇంగ్లండ్ పురుషుల సీనియర్ టెస్ట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు ఆమె ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంగ్లండ్ సీనియర్ పురుషుల టెస్ట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ సారా టేలర్‌ను నియమించినట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ రాబ్ కీ బుధవారం ప్రకటించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం ఇంగ్లండ్ పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్‌గా సారా టేలర్‌ను చరిత్రలో నిలిపింది.
ఎవరీ సారా టేలర్?
సారా టేలర్ (36 సంవత్సరాలు) మహిళా క్రికెట్‌లో లెజెండ్. 2006 నుంచి 2019 వరకు ఇంగ్లండ్ తరపున 226 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఆమె ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్‌కీపర్లలో ఒకరిగా పరిగణిస్తారు.
2017 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ విజయం
మూడు వరల్డ్ కప్ టైటిళ్లు (మహిళలు)
అనేక రికార్డులు
ఆమె 2019లో ఆందోళన (ఆంక్సైటీ) సమస్యల కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌ను వదిలేసింది. అయితే కోచింగ్ ద్వారా క్రికెట్ ప్రపంచంలోకి తిరిగి వచ్చింది.
కోచింగ్ జర్నీ
2021లో ససెక్స్ పురుషుల జట్టుకు వికెట్‌కీపింగ్ కోచ్‌గా నియమితురాలై మహిళల్లో తొలి స్పెషలిస్ట్ కోచ్ గా చరిత్ర సృష్టించింది.
ఇంగ్లండ్ లయన్స్ (A జట్టు)కు అసిస్టెంట్ కోచ్‌గా ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో కలిసి పని చేసింది.
ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా పర్యటనల్లో మెన్స్ జట్టుతో పని చేసిన అనుభవం ఉంది.
ఈ నేపథ్యంలోనే రాబ్ కీ (ECB డైరెక్టర్ ఆఫ్ క్రికెట్) సారా టేలర్‌ను పురుషుల టెస్ట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. కార్ల్ హాప్కిన్సన్ IPL వల్ల లేనందున ఈ షార్ట్-టర్మ్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 226 మ్యాచ్‌లు ఆడిన టేలర్, పురుషుల జట్టుతో పాటు మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు కూడా పనిచేశారు. ఆమెకు ఫీల్డింగ్ కోచ్‌గా స్వల్పకాలిక కాంట్రాక్ట్ ఆఫర్ చేశారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో పనిచేస్తున్న కార్ల్ హాప్కిన్సన్ స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు.
