భారత మాజీ క్రికెటర్ సంచిన్ టెండూల్కర్ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఆయన కూతురు సారా గురించి అందరికీ తెలుసు.. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.. వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది.. లవ్, డేటింగ్ గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరలవుతుంటాయి.. కానీ ఆ రూమర్స్ గురించి ఎప్పుడూ పట్టించుకోదు.. అందుకే పెద్దగా స్పందించదు..
సారా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఆన్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వక పోయిన స్టార్ హీరోయిన్ కన్నా ఎక్కువగానే ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. బంగారు డాలీ జె లెహాంగాలో మరింత అందంగా కనిపిస్తుంది సారా. థ్రెడ్‌వర్క్ తో ఉన్న లెహాంగాలో లైట్ మేకప్ లో చాలా అందంగా ఉంది..
సారా షేర్ చేసిన ఫోటోలకు ఒక గంటలోపే 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. సారా డాషింగ్ ఫోటోలపై నెటినజ్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సారా చేసిన ఫోటో షూట్ ఓ పంజాబీ సాంగ్ కోసం అని తెలుస్తోంది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ సాంగ్ కోసం రెడీ అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టింది..ఇక త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. చాలాకాలంగా ఆమె క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో ఉందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.. వాటి పై ఇద్దరు స్పందించలేదు..
