Royal Challengers Bangalore Won The Match By 112 Runs Against RR: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో రాజస్థాన్ రాయల్స్ చిత్తుచిత్తుగా ఓడింది. ఆర్సీబీ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్ ఛేధించలేకపోయింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఆర్ఆర్ పేకమేడలా కుప్పకూలింది. కేవలం 59 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. 112 పరుగుల తేడాతో ఆర్సీబీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఒక్క షిమ్రాన్ హెట్‌మేయర్ (19 బంతుల్లో 35) పోరాట పటిమ కనబర్చగా.. మిగతా ఆర్ఆర్ బ్యాటర్లు అత్యంత దారుణంగా విఫలమయ్యారు. అందుకే, ఆర్ఆర్ ఇంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.
Adah Sharma: ది కేరళ స్టొరీ హీరోయిన్ కి యాక్సిడెంట్…
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (55), మ్యాక్స్‌వెల్ (54) అర్థశతకాలతో రాణించడం.. చివర్లో అనూజ్ రావత్ (29) మెరుపులు మెరిపించడంతో.. ఆర్సీబీ అంత స్కోరు చేయగలిగింది. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. 10.3 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నిజానికి.. ఆర్ఆర్‌కి ఉన్న బ్యాటింగ్ లైనప్ చూసి.. ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేధిస్తారని మొదట్లో అంతా అనుకున్నారు. ఓపెనర్ల దగ్గర నుంచి ఏడో వికెట్ దాకా.. అందరూ దూకుడుగా ఆడుతారు కాబట్టి, ఈజీగా ఈ లక్ష్యాన్ని ఛేజ్ చేస్తారని భావించారు. కానీ.. ఆర్సీబీ బౌలర్లు ఆ అంచనాల్ని బోల్తా కొట్టిస్తూ, ఆర్ఆర్‌ని 59 పరుగులకే ఆలౌట్ చేసేశారు.
Companies Earnings: అత్యధిక వార్షికాదాయం కలిగిన టాప్-10 కంపెనీలు
తమ జట్టుకి ఎప్పుడూ శుభారంభాన్నిచ్చే జైస్వాల్, బట్లర్ ఈసారి డకౌట్ అయ్యారు. కెప్టెన్ సంజూ కూడా 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. రాకరాక వచ్చిన ఛాన్స్‌ని జో రూట్ వినియోగించుకుంటాడని అనుకుంటే.. అతడు కూడా 10 పరుగులే చేసి చేతులెత్తేశాడు. మధ్యలో షిమ్రాన్ కాస్త మెరుపులు మెరిపించాడు. కానీ, ఇంతలోనే అతడు కూడా ఔట్ అయ్యాడు. ఇలా వెనువెంటనే వికెట్లు కోల్పోయి, ఆర్ఆర్ 59 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. ఆర్సీబీ బౌలర్లలో పార్నెల్ 3 వికెట్లు, బ్రేస్‌వెల్ & కరణ్ శర్మ చెరో రెండు వికెట్లు, మ్యాక్స్‌వెల్ & సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
