Site icon NTV Telugu

Cristiano Ronaldo : సహనం కోల్పోయిన రోనాల్డ్.. ఫుట్ బాల్ పై కోపం..

Ronalad

Ronalad

పొర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డ్ మరోసారి తన సహనం కోల్పోయాడు. వరుసగా మూడో మ్యాచ్ లోనూ ఆయన గోల్ కొట్టడంలో విఫలమైనాడు. దీంతో మరింత కోపం రావడంతో ఎవరి మీద తన కోపం చూపించాలో తెలియక ఫుట్ బాల్ మీదే చూపించాడు. అది చూసిన మ్యాచ్ రిఫరీ రొనాల్డ్ కు ఎల్లో కార్డు ఇచ్చాడు. సౌదీ అరేబియన్ ప్రో-లీగ్ లో భాంగా అల్-నసర్, అభాల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో 3-1 తేడాతో రొనాల్డ్ సేన విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ లో రొనాల్డ్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు.

Also Read : KA Paul: కేఏ పాల్‌ను చంపేందుకు కుట్ర..!

రొనాల్డ్ చేతిలో బంతి ఉండగా ఫస్ట్ హాఫ్ ముగిసినట్లు విజిల్ వేశాడు రిఫరీ. అప్పటికే గోల్ కొట్టలేదన్న కోపంలో ఉన్న రొనాల్డ్ తన వద్ద బంతిని కాలితో బలంగా తన్నాడు. అంతే ఒక్క ఉదుటన బంతి 60 మీటర్ల దూరంలో పడింది. రొనాల్డ్ చర్యకు తోటి ఆటగాళ్లు సహా ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇది గమనించిన రిఫరీ రొనాల్డ్ కు ఎల్లోకార్డును జారీ చేసాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రొనాల్డ్ ఇలా చేయడం ఇది తొలిసారి మాత్రం కాదు.. ఇంతకు ముందు అల్ ఇత్తిహాద్ లో జరిగిన మ్యాచ్ లో 1-0తో ఓడిపోయామన్న కోపంతో మ్యాచ్ ముగిసిన తర్వాత క్రిస్టియానో రొనాల్డ్ వాటర్ బాటిల్ ను తన్నడం.. అది ఒక అభిమానికి తగలడం.. ఆ తర్వాత వచ్చి క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. ఇక మార్చ్ 18( శనివారం అల్ నసర్.. అభాతో మరో మ్యాచ్ జరుగనుంది.

Also Read : Etela Rajender: మాక్సిమం పాలిటిక్స్ మినిమం రూలింగ్.. ఇదే కేసీఆర్ పాలన

Exit mobile version