Site icon NTV Telugu

Royal Challengers Bangalore: ఆర్సీబీకి పెద్ద షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఔట్!

Reece Topley Out Of Ipl

Reece Topley Out Of Ipl

Reece Topley Ruled Out Of IPL 2023 Due To Injury: ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్ సొంతం చేసుకుని ఆర్సీబీ శుభారంభం చేసిందని ఆనందించేలోపే.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర పరాజయం చవిచూసి, అభిమానుల్ని నిరాశపరిచింది. ఆర్సీబీ ఆటగాళ్లు కూడా ఇంత దారుణ ఓటమిని చవిచూస్తారని అనుకుని ఉండరు. ఈ షాక్ నుంచి వాళ్లు తెరుకునేలోపే.. ఆ జట్టుకి మరో ఊహించని దెబ్బ తగిలింది. గాయం కారణంగా ఒక స్టార్ ప్లేయర్ సీజన్ మొత్తానికే దూరం అవ్వాల్సి వచ్చింది. ఇంతకీ.. ఆ ప్లేయర్ ఎవరు? అని అనుకుంటున్నారా.. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీప్ టాప్లీ!

Fire Accident : ప్లాస్టిక్ బాటిళ్ల తయారీ యూనిట్‌లో మంటలు

బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ ఆడిన తొలి మ్యాచ్‌లో.. బౌండరీ వైపు పరుగులు పెడుతున్న బంతిని ఆపబోయి, రీస్ టాప్లీ గాయపడ్డాడు. ఒక్కసారిగా అతడు డైవ్ చేయడంతో, భారం మొత్తం కుడిభుజంపై పడింది. దాంతో.. అతడు నొప్పితో మైదానంలోనే విలవిల్లాడు. కనీసం చెయ్యి కదల్చడానికి కూడా వీలు పడలేదు. అప్పటికప్పుడు ఫిజియో వచ్చి, అతడ్ని ఫీల్డ్ నుంచి బయటకు తీసుకెళ్లాడు. అతనికి చికిత్స అందించగా.. భుజానికి తగిలిన గాయం తీవ్రమైందని వైద్యులు నిర్ధారించారు. దీన్నుంచి కోలుకోవడానికి తగిన సమయం కావాల్సిందేనని సూచించారు. దీంతో.. టాప్లీ చికిత్స కోసం స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ కూడా స్పష్టం చేశాడు. అతని స్థానంలో మరో విదేశీ ఆటగాడ్ని తీసుకోనున్నట్టు ఆయన క్లారిటీ ఇచ్చాడు.

Mumbai: ముంబైలో అక్రమ ఫిల్మ్ స్టూడియోలు కూల్చివేత.. బీజేపీ సంబరాలు

సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘‘టాప్లీకి తగిలిన గాయం తీవ్రమైంది. ఇప్పుడప్పుడు ఆ గాయం నుంచి కోలుకోవడం కష్టం. దీంతో అతడు తన స్వదేశానికి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. తద్వారా అతడు ఈ టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. అతడి స్థానంలో మరో ఆటగాడిని రిప్లేస్‌ చేయబోతున్నాం’’ అంటూ చెప్పుకొచ్చాడు. టాప్లీ లాంటి ఆటగాడు దూరం అవ్వడం.. ఆర్సీబీకి పెద్ద లోటే. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఇతడు అద్భుతంగా బౌలింగ్ వేశాడు. వేసింది రెండు ఓవర్లే అయినా.. కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఇప్పుడు ఇతడు లేకపోవడంతో.. ఆర్సీబీ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడినట్టే.

Pushpa 2: పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందోచ్

Exit mobile version