ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ధర్మశాల వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఈ రెండు టీమ్స్ కీలకం. గెలిచిన జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉంటే ఓడిన టీమ్ ఇంటికి వెళ్లనుంది. టాస్ గెలిచిన సంజూ శాంసన్ సేన ఫీల్డింగ్ తీసుకోవడంతో పంజాబ్ కింగ్స్ తొలి ఇన్సింగ్స్ లో భారీ స్కోర్ సాధించారు. నిర్ణీత 20 ఓవర్లకు
5 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.
Also Read : సాగర తీరాన సారా అలీ ఖాన్ అందాల ఆరబోత
ఇక పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో సామ్ కరన్( 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 నాటౌట్ ), జితేశ్ శర్మ( 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 ), షారుక్ ఖాన్( 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 నాటౌట్ ) ధాటిగా ఆడారు. మిగిలిన వారిలో లివింగ్ స్టోన్(9), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(2)లు విఫలం కాగా.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్(17), అథర్వ తైదే(19) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైనీ మూడు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా చెరో వికెట్ తీసుకున్నారు.
Also Read : 2000 Notes Withdraw : ఆ సెక్షన్ ఉపయోగించి రూ. 2000 నోట్లు రద్దు చేసిన ఆర్బీఐ
అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ఆదిలోనే కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోవడంతో కష్టాల్లో పడింది. అయితే లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జోస్ బట్లర్ మళ్లీ డకౌట్ అయ్యాడు. రబాడ బౌలింగ్‌లో ఎల్భీగా పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో రాజస్థాన్ 12 పరుగుల(1.4వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 4.4 ఓవర్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో దేవదత్ పడిక్కల్ ( 13 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్ తో 23 పరుగులు ), యశస్వీ జైస్వాల్ ( 13 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు నాటౌట్ ) గా ఉన్నారు.