Site icon NTV Telugu

IPL 2022 : మలుపు తిప్పిన చహల్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం..

Rajastan

Rajastan

ఐపీఎల్‌-2022లో భాగంగా మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్దమైంది. బ్రబౌర్న్ వేదిక‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ తో త‌ల‌ప‌డ్డాయి. కేకేఆర్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల చేసి కేకేఆర్‌ ముందు భారీ స్కోరు నిలిపింది. జాస్‌ బట్లర్‌(61 బంతుల్లో 103, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సీజన్‌లో రెండో సెంచరీ సాధించగా.. సంజూ శాంసన్‌ 38 పరుగులు చేశాడు. ఇక చివర్లో హెట్‌మైర్‌ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులతో మెరిశాడు. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 2, శివమ్‌ మావి, పాట్‌ కమిన్స్‌, రసెల్‌ తలా ఒక​ వికెట్‌ తీశారు.

అనంతరం 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ లక్ష్యం దిశగా సాగుతున్న కేకేఆర్‌కు యుజ్వేంద్ర చహల్‌ గట్టిషాక్‌ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో చహల్‌ హ్యాట్రిక్‌ సహా నాలుగు వికెట్లు తీశాడు. ముందుగా వెంకటేశ్‌ అయ్యర్‌ను తొలి బంతికే స్టంప్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్‌ అయ్యర్‌, శివమ్‌ మావి, పాట్‌ కమిన్స్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. అంతేకాదు ఐపీఎల్‌ చరిత్రలో ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్‌ చరిత్ర సృష్టించాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ 7 పరుగుల తేడాతో ఓడించింది.

Exit mobile version