వివాదాలు, రాజకీయాలకు దూరంగా ఉండే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయారు.. అది కూడా ఆయన ఓ రాజకీయ పార్టీ సమావేశాలకు హాజరు అవుతారని వార్త.. దానికి ప్రధాన కారణం.. ఆయన భారతీయ జనతా పార్టీ సమావేశానికి హాజరుకానున్నారంటూ.. ఓ ఎమ్మెల్యే ప్రకటన చేయడంతో.. రాహుల్ ద్రవిడ్ సోషల్ మీడియాను షేక్ చేశారు. చివరకు స్వయంగా ఈ వ్యవహారంపై టీమిండియా హెడ్ కోచ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
Read Also: Cyclone Asani: దూసుకొస్తున్న ‘అసని’.. కేంద్ర హోంశాఖ సమీక్ష
పూర్తి వివరాల్లోకి వెళ్తే, హిమాచల్ ప్రదేశ్‌లో జరుగనున్న బీజేపీ యువ మోర్చా సమావేశానికి రాహుల్ ద్రవిడ్ హాజరవుతారంటూ జేపీ ఎమ్మెల్యే విశాల్ నహేరియా ప్రకటించారు.. దీంతో, ఈ వార్త సోషల్ మీడియాలో రచ్చ చేసింది.. రాహుల్ ఈ మీటింగ్‌కు హాజరు కావడం ఏంటి? అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. రాహుల్ ద్రవిడ్ కూడా బీజేపీలో చేరతారా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు ఫ్యాన్స్.. మరికొందరు ఆహ్వానిస్తున్నారు కూడా.. ఇలా పెద్ద చర్చే సాగింది. అయితే, ఈ రచ్చపై స్పందించారు రాహుల్ ద్రవిడ్.. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే బీజేపీ కార్యక్రమానికి తాను హాజరవుతానన్న తప్పుడు వార్తలను ఖండించారు. కాగా, మే 12 నుంచి మే 15 వరకు ధర్మశాలలో బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.
