Site icon NTV Telugu

నాలుగో టెస్టుకు పిచ్ ‌లో ఏ మార్పు ఉండదు : రహానే

లార్డ్స్‌ లో జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ గెలవడం తమకు ప్రపంచకప్‌ తో సమానమని అన్నాడు అజింక్య రహానే. నాలుగో టెస్టుకు సన్నద్ధమవుతున్న వేళ రహానే ఇషాంత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థించాడు. ఇషాంత్‌ చెప్పింది నిజమని… తాము నాలుగో టెస్టు గెలవడంతో పాటు లార్డ్స్‌ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నాడు. మూడో టెస్టులో పిచ్‌ ఏ విధంగా ఉందో చివరి టెస్టుకు కూడా అలాగే ఉంటుందన్నాడు. అందులో ఏ మార్పు ఉండదని స్పష్టం చేశాడు. అయితే భారత్ ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ కు వెళ్లాలంటే రేపటి నుండి ఇంగ్లాండ్ తో ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో విజయం అయిన సాధించాలి లేదా డ్రా అయిన చేసుకోవాలి. కానీ ఓడిపోకూడదు. ఒకవేళ ఓడిపోతే ఫైనల్ కు ఆసీస్ వెళ్తుంది.

Exit mobile version