ఐపీఎల్‌లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా లివింగ్ స్టోన్ విధ్వంసంతో పంజాబ్ జట్టు కోలుకుంది. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా లివింగ్ స్టోన్ చెలరేగాడు. అంతేకాకుండా ముఖేష్ చౌదరి వేసిన ఓవర్‌లో 108 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే పెద్ద సిక్సర్. ముంబై ఇండియన్స్ ఆటగాడు బట్లర్ 104 మీటర్ల సిక్స్ కొట్టగా.. ఆ రికార్డును లివింగ్ స్టోన్ బ్రేక్ చేశాడు.
లివింగ్ స్టోన్ ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో మొత్తం 60 పరుగులు చేశాడు. అతడి తర్వాత అత్యధిక స్కోరు చేసింది ధావన్ మాత్రమే. ధావన్ 33 పరుగులు చేశాడు. ధావన్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. జితేష్ శర్మ 26 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 180 పరుగులు సాధించింది. చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్, ప్రిటోరియస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బ్రావో, ముఖేష్ చౌదరి, జడేజా తలో వికెట్ సాధించారు.
https://ntvtelugu.com/womens-world-cup-2022-winner-is-australia-team/
