Site icon NTV Telugu

ఒలింపిక్స్‌ క్రీడలకు ట్రాన్స్‌జెండర్‌ ఎంపిక…

టోక్యోలో జ‌రిగే ఒలింపిక్స్ క్రీడ‌ల‌కు ట్రాన్స్‌జెండ‌ర్‌ను ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌కు చెందిన లారెల్ హ‌బ్బ‌ర్డ్‌.. ఒలింపిక్స్‌లో పోటీ చేయ‌నున్న తొలి ట్రాన్స్‌జెండ‌ర్ కానున్నారు. ఆ దేశ మ‌హిళ‌ల వెయిట్ లిఫ్టింగ్ జ‌ట్టు కోసం ఆమెను ఎంపిక చేశారు. ట్రాన్స్‌జెండ‌ర్‌గా మార‌క‌ముందు ఆమె 2013లో మెన్స్ ఈవెంట్స్‌లో పాల్గొన్న‌ది. హ‌బ్బ‌ర్డ్ ఎంపిక ప‌ట్ల వివాదం చెల‌రేగుతోంది. మ‌హిళ జ‌ట్టుకు లారెల్‌ను ఎంపిక చేయ‌డం వ‌ల్ల ఆమెకు ఎక్క‌వ అడ్వాంటేజ్ ఉంటుంద‌ని కొంద‌రు అన్నారు. మ‌రికొంద‌రు మాత్రం ట్రాన్స్‌జెండ‌ర్ల సంఖ్య‌ను పెంచాలంటున్నారు.

Exit mobile version