Site icon NTV Telugu

అంపైర్‌పై ఆగ్రహం.. టెన్నిస్ ఆటగాడికి భారీ జరిమానా

ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ మ్యాచ్ మధ్యలో అంపైర్‌పై నోరు పారేసుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్‌కు గ్యాలరీలో కూర్చున్న అతడి తండ్రి సలహాలు ఇస్తున్నాడని మెద్వెదెవ్ ఆరోపించాడు. నీకది కనిపించడంలేదా? నువ్వు మూర్ఖుడివా? అంటూ అంపైర్‌ను దుర్భాషలాడాడు. ఈ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read Also: టీమిండియా క్రికెటర్లకు షాక్.. ఈసారి ప్రత్యేక విమానాల్లేవ్..!!

దీంతో రష్యా ఆటగాడు మెద్వెదెవ్ పై టోర్నీ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. అంపైర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు రూ.9 లక్షల జరిమానా విధించారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా నడుచుకున్నందుకు రూ.6 లక్షలు, అభ్యంతరకర పదజాలం వాడినందుకు మరో రూ.3 లక్షలు జరిమానా వేశారు. కాగా శుక్రవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో మెద్వెదెవ్ గెలిచి ఫైనల్ చేరాడు. ఫైనల్లో స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్‌తో అతడు తలపడనున్నాడు.

Exit mobile version