Site icon NTV Telugu

ఐపీఎల్ లోకి తిరిగి గంభీర్…

భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్ 2022 లో కొత్తగా వస్తున్న లక్నో ఫ్రాంచైజీకి మెంటార్‌ గా నియమితుడయ్యాడు. అయితే ప్రస్తుతం బీజేపీ పార్లమెంటు సభ్యుడి గా ఉన్న గంభీర్… కెప్టెన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ కి రెండు ఐపీఎల్ టైటిళ్లను అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తనను మెంటార్‌ గా నియమించడం పై గంభీర్ స్పందిస్తూ… “నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు గోయెంకా మరియు RPSG గ్రూప్‌కి ధన్యవాదాలు అని గంభీర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే సంజీవ్ గోయెంకా కూడా గంభీర్‌ ని తమ కుటుంబంలోకి స్వాగతించారు. “గౌతమ్ కెరీర్‌ లో చాలా మంచి రికార్డులు ఉన్నాయి. అతని క్రికెట్ మైండ్‌ ని నేను గౌరవిస్తాను మరియు అతనితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అని అతను చెప్పాడు. అయితే గంభీర్ భారత జట్టు తరపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు.

Exit mobile version