ఈరోజు చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన ముంబైని ఆల్ ఔట్ చేసారు కోల్‌కత బౌలర్లు. కేవలం రెండే ఓవర్లు వేసిన ఆండ్రీ రస్సెల్ 5 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ తో జట్టులో వచ్చిన ముంబై ఓపెనర్ డికాక్ నిరాశపరిచిన వన్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్(56) అర్ధశతకంతో రెచ్చిపోయాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ(43) పరుగులతో రాణించిన మిగిత ఆటగాళ్లు అందరూ వరుసగా పెవిలియన్ ధరి పట్టడంతో ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది ముంబై. అయితే రస్సెల్ సగం ముంబై జట్టును పెవిలియన్ చేర్చగా పాట్ కమ్మిన్స్ రెండు వికెట్లు, షకీబ్ అల్ హసన్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే కేకేఆర్ 153 పరుగులు చేయాలి. అయితే ముంబై బౌలింగ్ కూడా బలమైందే అనే విషయం తెలిసిందే.