KL Rahul Ruled Out Of IPL 2023 Due To Injury: లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి భారీ షాక్ తగిలింది. అత్యంత కీలక ఆటగాడు, ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఈ సీజన్ మొత్తానికే దూరం కానున్నాడని సమాచారం. హోమ్‌గ్రౌండ్‌లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో.. బౌండరీ లైన్‌వైపు దూసుకుపోతున్న బంతిని ఆపబోతూ, కేఎల్ రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే! తొడ కండరానికి గాయం కావడంతో.. అతడు మైదానంలోనే కాసేపు విలవిల్లాడాడు. తిరిగి నిలబడలేకపోయాడు. దీంతో.. ఫిజియోలు వచ్చి, వెంటనే అతడ్ని మైదానం నుంచి తీసుకెళ్లారు. గ్రౌండ్ చుట్టూ కాసేపు చక్కర్లు కొట్టించారు. అనంతరం.. బ్యాటింగ్ ఆర్డర్‌లో చివర్లో వచ్చిన అతగాడు, బ్యాటింగ్ చేసేందుకు కూడా తడబడ్డాడు. పరుగులు తీయడానికి చేతకాక.. క్రీజులోనే నిల్చుండిపోయాడు. దీన్నిబట్టి.. అతనికి ఎంత తీవ్రమైన గాయమైందో అర్థం చేసుకోవచ్చు.
Mohammed Shami: షమీకి ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి.. భార్య హసీన్ జహాన్ ఆరోపణలు
కేఎల్ రాహుల్ గాయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం అతడు లక్నో జట్టుతోనే ఉన్నాడు. బుధవారం చెన్నైతో మ్యాచ్‌ను వీక్షించిన తర్వాత అతడు జట్టును వీడుతాడు. ముంబైలో బీసీసీఐ ఆధ్వర్యంలో అతనికి స్కానింగ్ పరీక్షలు జరుగుతాయి. అతనితో పాటు జయదేవ్ ఉనాద్కడ్ పరిస్థితిని సైతం బీసీసీఐ సమీక్షిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో.. రాహుల్ ఈ ఐపీఎల్ టోర్నీ మొత్తానికే దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరీక్షల అనంతరం.. ఈ టోర్నీ మొత్తం నుంచి కేఎల్ రాహుల్ తప్పుకుంటాడా? లేక రెండు, మూడు మ్యాచ్‌లకే దూరం అవుతాడా? అనే విషయంపై స్పష్టత రానుంది. ఒకవేళ టోర్నీ మొత్తానికి దూరమైతే మాత్రం.. లక్నో జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే. ఆటగాడిగా అతని విఫలమవుతున్న సంగతిని పక్కనపెడితే.. కెప్టెన్‌గా మాత్రం అతడు సమర్థవంతంగా జట్టుని నడిపిస్తున్నాడు. ఇప్పుడు అతని లోటు తప్పకుండా కనిపిస్తుంది.
CSK vs LSG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న సీఎస్కే