Site icon NTV Telugu

Karun Nair Cries: గుక్కపెట్టి ఏడ్చేసిన కరుణ్ నాయర్.. కేఎల్ రాహుల్ ఎమోషనల్!

Karun Nair

Karun Nair

Karun Nair Cries: టీమిండియా బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ కు చేదు అనుభవం మిగిలంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన అతడు ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లో సత్తా చాటలేకపోయాడు. ఇంగ్లండ్‌ తో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులోని మొదటి ఇన్సింగ్స్ లో డకౌట్‌ అయి తీవ్ర నిరాశపరిచాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు.. అలాగే, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో వరుసగా 31, 26 రన్స్ మాత్రమే చేశాడు. లార్డ్స్‌ టెస్టులోని తొలి ఇన్సింగ్స్ లో కాస్త ఫర్వాలేదనిపించిన కరుణ్.. రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ పాత కథే పునరావృతం చేశాడు. కేవలం 14 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఈ నేపథ్యంలో అతడి ఆట తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికే మూడుసార్లు ఛాన్సులు ఇచ్చినా కరుణ్‌ తనను తాను నిరూపించుకోలేకపోయాడు.. ఇకపై అతడి స్థానంలో సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వచ్చాయి.

Read Also: Bihar: స్కూల్‌లో “నాగమణి”ని వదిలి వెళ్ళిన తాచు పాము..? అలాంటి మణి నిజంగా ఉందా..?

దీంతో నాలుగో టెస్టులో కరుణ్‌ నాయర్‌పై టీమిండియా యాజమాన్యం వేటు వేసి.. సాయి సుదర్శన్‌ను రంగంలోకి దించింది. మాంచెస్టర్‌ మ్యాచ్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 151 బంతులు ఎదుర్కొని 61 పరుగులు చేశాడు. ఒకవేళ సుదర్శన్ ఇలాగే అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటే.. కరుణ్‌ నాయర్‌కు చెక్‌ పడినట్లే. ఈ నేపథ్యంలో కరుణ్‌ నాయర్‌కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. బ్లూ జెర్సీ వేసుకున్న కరుణ్‌ నాయర్‌ ఏడుస్తున్నట్లుగా అందులో కనబడుతుంది. ఇక, కరుణ్‌ ను అతడి చిన్ననాటి స్నేహితుడు కేఎల్‌ రాహుల్‌ ఓదారుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇది చూసిన అభిమానులు కరుణ్‌ నాయర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించబోతున్నాడా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version