NTV Telugu Site icon

Women’s World Cup: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్‌

భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు.. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఇవాళ వెస్టిండీస్‌-భారత్‌ మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఝులన్‌ గోస్వామి చరిత్ర సృష్టించారు.. మహిళల ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించారు.. వెస్టిండీస్‌ బ్యాటర్‌ అనిసా మహ్మద్‌ను ఔట్‌ చేయడంతో ఈ రికార్డు కెక్కారు గోస్వామి.. ఇప్పటి వరకు అత్యధిక వికెట్ల రికార్డు ఆస్ట్రేలియా బౌలర్‌ లిన్ ఫుల్‌స్టన్‌ (39 వికెట్లు)గా ఉండగా.. ఆమెను వెనక్కినెట్టి 40 వికెట్ల తీసి.. కొత్త చరిత్ర లికించింది.

Read Also: MLA Car: జనం పైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. ఒకరు మృతి, ఎమ్మెల్యేపై దాడి..

ఇక, ఇప్పటి వరకు అత్యధిక వికెట్ల రికార్డు సాధించిన ఆస్ట్రేలియా బౌలర్‌ లిన్‌ ఫుల్‌స్టన్ 20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో 39 వికెట్లు తీయగా.. ఝులన్‌ గోస్వామి మాత్రం 31 వన్డేల్లో ఆ రికార్డును బద్దలు కొట్టింది. మరోవైపు, ఇప్పటి వరకు 5 ప్రపంచ కప్‌లు ఆడిన గోస్వామి వన్డే ఫార్మాట్‌లో 198 మ్యాచ్‌ల్లో 249 వికెట్లు పడగొట్టి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతుండడంతో మరోవిశేషం. మొత్తంగా హామిల్టన్ వేదికగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఝులన్ గోస్వామి ఐసీసీ మహిళల ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించింది. వెస్టిండీస్‌పై 36వ ఓవర్‌లో గోస్వామి రికార్డు వికెట్‌ పడగొట్టారు. కాగా, టీమిండియా ప్రారంభ మ్యాచ్‌లో, ఆమె అద్భుతమైన బౌలింగ్‌తో 2/26తో పాకిస్థాన్‌పై భారత్‌ విజయంలో కీలక భూమిక పోషించారు.