Irfan Pathan: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అఫ్రిదికి నోటి దూల ఇప్పుడే కాదు.. అతడు ఆడే రోజుల్లోనూ కూడా ఎక్కువగానే ఉండేదన్నారు. ఓసారి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఇర్ఫాన్ పఠాన్ చెబుతూ.. 2006లో పాక్ పర్యటనకు వెళ్లినప్పుడూ.. ఇరు జట్ల ప్లేయర్స్ అందరం కరాచీ నుంచి లాహోర్‌కు ఒకే ఫ్లైట్‌లో జర్నీ చేశాం.. నేను నా సీట్‌లో కూర్చొని ఉండగా అఫ్రిది వచ్చి.. నా తలపై చేయి వేసి నిమురుతూ.. ‘ఎలా ఉన్నావు బాబు?’ అని కామెంట్స్ చేశాడు.. ‘నువ్వెప్పుడు నాకు తండ్రిగా మారావు?’ అని అఫ్రిదిని క్వశ్చన్ చేశాను అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
Read Also: NCERT partition textbook: వార్తలకెక్కిన ఎన్‌సీఈఆర్‌టీ… దేశ విభజనకు వీళ్లే కారణం అంటూ కొత్త పాఠం..
ఇక, అఫ్రిదివి పిల్ల చేష్టలు.. నాకు అతడు ఫ్రెండ్ కూడా కాదు.. ఆ తర్వాత కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు ఉపయోగించాడు అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. అయితే, నాకు కాస్త పక్కనే అతడి సీట్ ఉంది.. మరోవైపు, అబ్దుల్ రజాక్ సీట్‌లో ఉండగా.. అప్పుడు రజాక్‌ను ‘ఇక్కడ ఏ మాంసం లభిస్తుంది అని అడిగాను.. కొన్ని రకాలను అతడు చెప్పగా.. వెంటనే ఇక్కడ కుక్క మాంసం దొరుకుతుందా? అని అడిగాను.. రజాక్‌తో పాటు అఫ్రిది కూడా షాక్ అయ్యాడు. ‘హే ఇర్ఫాన్, ఎందుకు అలా అన్నావు?’ అని రజాక్ క్వశ్చన్ చేశాడు.. ఏం లేదు.. అఫ్రిది కుక్క మాంసం కూడా తిన్నాడేమో.. చాలా సేపటి నుంచి మొరుగుతూనే ఉన్నాడని అనడంతో అఫ్రిది అప్పటి నుంచి మౌనంగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏమన్నా సరే.. ఇదిగో అతడు అరుస్తున్నాడంటూ కామెంట్ చేసేవాడిని.. దీంతో అప్పటి నుంచి నన్ను చూస్తే చాలు అఫ్రిది సైలెంట్ అవుతాడు అని ఇర్ఫాన్ వివరించాడు.
