Faf du Plessis Says Extremely proud our RCB Team: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 20 పరుగులు తక్కువగా చేయడమే తమ ఓటమిని శాసించిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. తమ కుర్రాళ్లు అద్భుతంగా పోరాడారని, గెలుపు కోసం ఆఖరి వరకు సాయశక్తులా ప్రయత్నించారని ప్రశంసించారు. వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ చేరడం సంతోషాన్ని ఇచ్చిందని, కానీ ఎలిమినేటర్‌లో ఓడడం బాధగా ఉందని ఫాఫ్ తెలిపాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ… ‘మంచు ప్రభావం ఉన్నప్పుడు అదనపు పరుగులు చేయాలి. ఈ మ్యాచ్‌లో మేం 20 పరుగులు తక్కువగా చేశాం. అయినా మా బాయ్స్ అద్భుతంగా పోరాడారు. విజయం కోసం చివరి వరకు సాయశక్తులా ప్రయత్నించారు. సహజంగా ఈ పిచ్ పరిస్థితులను చూస్తే 180 పరుగుల చేయాలి. ఇక్కడ 180 పైగా రన్స్ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ భారీ ప్రభావం చూపుతోంది. భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేని పరస్థితి నెలకొంది’ అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో షిమ్రాన్ హెట్‌మయర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 14 బంతుల్లో 26 రన్స్ చేశాడు.
Also Read: Glenn Maxwell: ఐపీఎల్ చరిత్రలోనే గ్లెన్ మాక్స్‌వెల్ అత్యంత చెత్త రికార్డు!
‘ఈ సీజన్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల éఎంతో గర్వపడుతున్నాను. చాలా టీమ్స్ అగ్రస్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయాయి. మేం అద్భుతంగా పుంజుకున్నాం. వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్ చేరాం. మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాం. బెంగళూరు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. అయితే ఈ రోజు మేం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాం. బ్యాటింగ్‌లో 20 పరుగులు అదనంగా చేసుంటే ఈ రాత్రి మాకు మరోలా ఉండేది’ అని ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు.