IPL 2024 PlayOffs Predictions: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కథ ముగిసింది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి ముందుగానే నిష్క్రమించింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో.. ఆర్‌సీబీ ఇంటిదారి పట్టక తప్పలేదు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒకే ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉండే. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఓటమితో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ.. ఒకే ఒక్క విజయం మాత్రమే సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై బెంగళూరు గెలిచింది. 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయి -1.046 రన్‌రేటుతో పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ గెలిచినా 14 పాయింట్స్ సాధిస్తుంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల ప్రకారం.. 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యం.
Also Read: Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో పెరగనున్న రాజకీయ వేడి.. మూడు రోజుల పాటు మోడీ – అమిత్ షా ర్యాలీలు
ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్ర స్థానంలో ఉంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. మరో రెండు విజయాలు సాధిస్తే.. ఆర్ఆర్ ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదేసి విజయాలతో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఐపీఎల్ అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ దక్కాలంటే.. 18 పాయింట్స్ అవసరం అన్న విషయం తెలిసిందే.