Site icon NTV Telugu

KKR vs CSK: కేకేఆర్‌పై భారీ తేడాతో సీఎస్కే ఘనవిజయం

Csk Won Against Kkr

Csk Won Against Kkr

Chennai Super Kings Won By 49 Runs Against KKR: ‘నీ ఇంట్లో దూరి కొడతా’ అనే సినిమా డైలాగ్ అన్నట్టు.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును వారి హోమ్ గ్రౌండ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుచిత్తుగా ఓడించింది. సీఎస్కే నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేయగలిగింది. దీంతో.. 49 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. కేకేఆర్ టాపార్డర్ ఘోరంగా విఫలమవ్వడం, ఆండ్రూ రసెల్ లాంటి స్టార్ ప్లేయర్ మరోసారి చేతులు ఎత్తేయడంతో.. కేకేఆర్‌కి ఈ ఓటమి తప్పలేదు. జేసన్ రాయ్, రింకూ సింగ్ అర్థశతకాల పుణ్యమా అని.. కేకేఆర్ కనీసం 186 పరుగులైనా చేయగలిగింది. లేకపోతే.. తక్కువ స్కోరుకే చాపచుట్టేయాల్సింది.

Akkineni Nagarjuna: చిన్నప్పటి నుంచి అఖిల్ తో ప్రాబ్లమే.. డాక్టర్ కు చూపిస్తే

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. అజింక్యా రహానే (29 బంతుల్లో 71), శివమ్ దూబే (21 బంతుల్లో 50), డెవాన్ కాన్వే (40 బంతుల్లో 56) ఊచకోత కోయడంతో పాటు రుతురాజ్ గైక్వాడ్ (35) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా.. చెన్నై జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. కేకేఆర్ బౌలర్లో ఒక్క సుయేశ్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ వేయగా.. మిగతా వాళ్లు చాక్లెట్లు పంచినట్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు.. మొదట్లో పేకమేడల్లా వికెట్లు కోల్పోయింది. భారీ షాట్లకు కేరాఫ్ అడ్రస్ అయిన సునీల్ నరైల్ సున్నా పరుగులకే ఔట్ అవ్వగా.. అతని వెనకాలే నేనూ వస్తానంటూ జగదీశన్ పెవిలియన్ బాట పట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ కాసేపు క్రీజులో నిల్చోవడంతో.. అతడు కుదురుకున్నాడనే అంచనాలు నెలకొన్నాయి. కానీ.. ఇంతలోనే అతడు ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు.

Haunted Buildings: ప్రపంచంలో 10 అత్యంత భయంకరమైన భవనాలు

నితీశ్ రానా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ముందుకు నడిపిస్తాడని అనుకుంటే.. అతడు కూడా నిరాశాజనకమైన ప్రదర్శనతో నిట్టూర్చాడు. కేవలం 27 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఇంకేముంది.. కేకేఆర్ పని అయిపోయిందని, తక్కువ స్కోరుకే చాపచుట్టేస్తుందని అంతా భావించారు. అలాంటి సమయంలో జేసన్ రాయ్, రింకూ సింగ్‌లు కేకేఆర్‌కి ఊపిరి పోశారు. ఇద్దరూ కాసేపు బౌండరీల మీద బౌండరీలు బాదుతూ.. మైదానంలో కాసేపు పరుగుల వర్షం కురిపించారు. లక్ష్యానికి చాలా దూరంలో ఉన్నారని తెలిసినా.. వీరిద్దరి ఆట మాత్రం కేకేఆర్ అభిమానుల్లో ఊపు తీసుకొచ్చింది. బహుశా వీళ్లిద్దరే నిలబడి ఛేజ్ చేస్తారేమో? అనేంత ఆశలు చిగురించేలా ఇద్దరు దుమ్ముదులిపేశారు. కానీ.. ఎప్పుడైతే జేసన్ రాయ్ ఔటయ్యాడో, అప్పుడు పూర్తిగా ఆశలు సన్నగిల్లాయి. రింకూ సింగ్ చివరివరకూ క్రీజులో నిలబడి ఏదో మ్యాజిక్ చేయాలని ట్రై చేశాడు కానీ, అది సాధ్యపడలేదు. ఏదేమైనా.. వీరిద్దరి పోరాటాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే.

Exit mobile version