NTV Telugu Site icon

కివీస్‌ క్రికెటర్‌పై సచిన్‌ ప్రశంసలు…

న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పైనల్‌లో భారత జట్టు ఓటమికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యకారణం మాత్రం కైల్ జెమీసన్. కివీస్‌లో రాస్ టేలర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈ టెస్టు తర్వాత ఎక్కువ పేరు వచ్చింది జెమీసన్‌కే. రెండు ఇన్సింగ్స్‌లలోనూ కలిపి మొత్తం ఏడు వికెట్లు పడగొట్టిన జెమీసన్ భారత జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. జెమీసన్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. రాబోయే రోజుల్లో ప్రపంచ క్రికెట్‌లో జెమీసన్ లీడింగ్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని సచిన్ జోస్యం చెప్పాడు.