India VS Zimbabwe 3rd ODI: భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ లో భారత్ సత్తా చాటుతోంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా సిరీస్ క్లీన్‌స్వీప్ పై కన్నేసింది. ఇప్పటికే వరసగా రెండు వన్డేల్లో జింబాబ్వేను చిత్తు చేసింది. ఏ దశలో కూడా జింబాబ్వే జట్టు భారత జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది. తాజాగా సోమవారం రోజు ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరగబోతోంది. అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న టీమిండియాను అడ్డుకోవడం అంత సులభం ఏం కాదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. జింబాబ్వే జట్టు టీమిండియాను ఓడించడం అసాధ్యం.
అయితే ఫామ్ లేమితో బాధపడుతున్న కేఎల్ రాహుల్ ఈ వన్డేతో అయిన ఫామ్ సంపాదిస్తాడో లేదో చూడాలి. కేఎల్ రాహుల్ తప్పిస్తే జట్టులోని యువ ఆటగాళ్లంతా తమ శక్తి సామర్థ్యాలను చూపిస్తున్నారు. అయితే మొదటి వన్డేలో కేఎల్ రాహుల్ కు బ్యాటింగ్ అవకాశం రాకపోగా.. రెండో వన్డేలో కేవలం ఒకే పరుగుకు వెనుదిరిగాడు. బౌలింగ్ విషయంలో టీమిండియా అదరగొడుతోంది. దీపక్ చాహర్, సిరాజ్, శార్దూల్, ప్రసిద్ధ్, అక్షర్ లు బౌలింగ్ కు జింబాబ్వే బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. దీంతో మొదటి వన్డేలో కేవలం 191 పరుగులకే ఆల్ అవుట్ కాగా.. రెండో వన్డేలో 161 పరుగులకే కుప్పకూలింది. ఇక ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్ సత్తా చాటుతున్నారు. కీపర్, బ్యాటర్ సంజూ సామ్సన్ కూడా పర్వాలేదు అనిపిస్తున్నాడు.
Read Also: Car Thief: ఈ దొంగ యమా స్మార్ట్.. కారు ట్రైల్ వేస్తానని చెప్పి
జట్ల అంచనా
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, షాబాజ్ అహ్మద్.
జింబాబ్వే:
రెగిస్ చకబ్వా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, తనకా చివాంగా, బ్రాడ్లీ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ఇనోసెంట్ కైయా, టకుడ్జ్వానాషే కైటానో, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, తాడివానాషే మారుమాని, జాన్ మసారా, టోనీ మునియోంగా, రిచర్డ్ న్గార్వా, వీ మిల్టన్ షుంబా, డోనాల్డ్ తిరిపానో.
