IND vs SA 5th T20: దక్షిణాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 19న) చివరి టీ20 మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే టీ20 సిరీస్ దక్కించుకున్నట్టు అవుతుంది. అటు పర్యాటక జట్టుకు మాత్రం సిరీస్ గెలిచే ఛాన్స్ లేదు. కాకపోతే, లాస్ట్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేసే అవకాశం మాత్రం ఉంది.
Read Also: Supreme Court: ఉత్కంఠ! నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ..
ఇక, ప్రాక్టీస్ సమయంలో గాయపడిన వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో టీ20కి అందుబాటులో ఉండడని ఇప్పటికే ప్రకటించారు. కానీ, ఆ మ్యాచ్ రద్దు కావడంతో.. తను జట్టుతో పాటే అహ్మదాబాద్‌కు చేరడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కానీ ఆఖరి టీ20లో అతను ఆడే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. సంజూ శాంసన్‌ను డగౌట్ కే పరిమితం చేస్తూ వరుసగా విఫలమవుతున్న గిల్‌ను ప్రతీ మ్యాచ్‌లో ఆడిస్తుండడంపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడి ప్లేస్ లో శాంసన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించే ఛాన్స్ ఉంది. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లేమి కూడా కొనసాగుతూనే ఉంది. సారథిగా జట్టును విజయపథంలో నడిపిస్తున్నా, వ్యక్తిగత ఆట తీరు మాత్రం దారుణంగా ఉంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. ఇక, పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో చేరడం సానుకూలాంశంగా చెప్పాలి. మరో పేసర్ హర్షిత్‌ను కొనసాగిస్తారా? లేక స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తారా? అనేది వేచి చూడాలి.
Read Also: Astrology: డిసెంబర్ 19, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్‌న్యూస్..!
అయితే, ఈ సిరీస్ లో సౌతాఫ్రికా జట్టు పడిలేస్తూ ముందుకు సాగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో మాత్రం నిలకడలేమి కనిపిస్తోంది. చివరి మ్యాచ్‌లోనైనా సమష్టి ఆటతో భారత్‌ను ఎదుర్కోవాలని అనుకుంటోంది. ఓపెనర్‌గా హెన్‌డ్రిక్స్ వరుసగా నిరాశపర్చడంతో కెప్టెన్ మార్‌క్రమ్ ఆ స్థానంలో ఆడే ఛాన్స్ ఉంది. మరో ఓపెనర్ డికాక్ రెండో మ్యాచ్‌లో మాత్రమే శతకంతో చెలరేగాడు.. అతను ఫామ్ అందుకుంటే బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అలాగే, హిట్టర్లు బ్రెవిస్, మిల్లర్ కూడా సిరీస్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. పేస్ ఆల్‌రౌండర్ యాన్సెన్ బౌలింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం మెరుపులు కనిపించడం లేదు. పేసర్లలో నోకియా ఫెయిల్ అవుతున్నా, ఎన్‌గిడి, బార్ట్‌మన్ భారత్‌ను కాస్త ఇబ్బంది పెడుతున్నారు.
Read Also: Heartbreaking Scene: హృదయవిధారక ఘటన.. ఉగ్రదాడిలో చనిపోయిన తండ్రి.. పప్పా లే అంటున్న చిన్నారి
పిచ్, వాతావరణం
అహ్మదాబాద్ నగరంలో 30 డిగ్రీల అధిక వేడితో కూడిన వాతావరణం ఉంటుంది.. కాబట్టి ఇక్కడ పొగ మంచు ఉండే సమస్య లేదని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. దీంతో మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం లేదు.. మోడీ స్టేడియం పిచ్ సహజంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు భారీ స్కోర్లు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇరు జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, గిల్/శాంసన్, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, దూబే, హర్షిత్/సుందర్, అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్.
దక్షిణాఫ్రికా: డికాక్, మార్‌క్రమ్ (కెప్టెన్), హెన్‌డ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, బాష్, లిండే/నోకియా, ఎన్‌గిడి, బార్ట్‌మన్.
