NTV Telugu Site icon

టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం ఐసీసీ కొత్త పాయింట్ల పాలసీ

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌-2లో సరికొత్త విధానానికి ICC ఆమోదముద్ర వేసింది. కొత్త పాయింట్ల పద్ధతిని ధ్రువీకరించింది. ఇకపై మ్యాచ్‌ గెలిస్తే 12, డ్రా అయితే 4, టై అయితే 6 పాయింట్లు లభిస్తాయని తెలిపింది. గత ఛాంపియన్‌షిప్‌లో ఒక సిరీసుకు 120 పాయింట్లు కేటాయించారు. రెండు మ్యాచులే ఉంటే… ఒక్కో మ్యాచుకు 60 వచ్చేవి. నాలుగు మ్యాచులుంటే కేవలం 30 పాయింట్లే లభించేవి. అయితే కరోనా కారణంగా మ్యాచులు జరగకపోవడంతో దీనిని మధ్యలోనే మార్చేశారు. పర్సంటేజీ విధానం తెచ్చారు. ఇందులో సమానత్వం లేదని, లోటుపాట్లు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దాంతో ఐసీసీ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.