PKL 2024 Final: రెండు నెలలకు పైగా క్రీడాభిమానులను అలరించిన ప్రొ కబడ్డీ లీగ్–11వ సీజన్ చివరి అంకానికి చేరింది. ఈరోజు (డిసెంబర్ 29) పుణెలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా.. హర్యానా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్ తుది పోరులో తలపడనుంది. వరుసగా రెండోసారి హర్యానా ఫైనల్ చేరగా.. ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ను దక్కించుకున్న పట్నా మధ్య రసవత్తరమైన పోరు కొనసాగడం ఖాయం.
Read Also: Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం..
ఇక, తొలిసారి ఛాంపియన్‌గా నిలవాలనుకుంటున్న హర్యానా స్టీలర్స్‌కు జైదీప్ సారథిగా, మన్‌ప్రీత్ సింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యంతో నేరుగా సెమీస్ కు చేరిన స్టీలర్స్.. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించాలని ఫిక్స్ అయింది. హర్యానా తరఫున శివమ్ పాతరె, వినయ్, జైదీప్ లపై భారీ అంచనాలను అభిమానులు పెట్టుకున్నారు. అయితే, యూపీ యోధాస్‌తో జరిగిన సెమీఫైనల్లో కీలక పాయింట్లు సాధించి జట్టును ఫైనల్ కు చేర్చిన శివమ్, వినయ్ ఈ మ్యాచ్‌లోనూ రాణించాలని హర్యానా స్టీలర్స్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇక, డిఫెన్స్‌లో రాహుల్, సంజయ్‌లు కూడా కీలకం కానున్నారు.
Read Also: PSLV-C60 Rocket: రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్.. నేడు శ్రీహరికోటకు ఇస్రో చైర్మన్
కాగా, మరోవైపు గతంలో వరుసగా మూడు సార్లు ప్రొ కబడ్డీ లీగ్ ట్రోఫీ దక్కించుకున్న పట్నా.. ఇప్పుడు నాలుగోసారి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని ఎదురు చూస్తుంది. యంగ్ ప్లేయర్స్ దేవాంక్ దలాల్, అయాన్ లోచాబ్ రాణించడంతో వరుస విజయాలతో ఫైనల్‌కు వచ్చిన పైరేట్స్.. అదే జోష్‌లో ట్రోఫీని దక్కించుకోవాలని చూస్తోంది.