ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ 93 పరుగులతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే మిగతా ఆటగాళ్లు కనీస పోరాటపటిమ కూడా చూపించలేదు. కెప్టెన్ ధోనీ 26 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో చాహల్, ఒబెడ్ మెకాయ్ రెండేసి వికెట్లు సాధించగా.. ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలవాలంటే 151 పరుగులు చేయాలి.
కాగా ఈ మ్యాచ్ పూర్తి కాకుండానే అధికారికంగా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను 150 పరుగులకే కట్టడి చేయడంతో రాజస్థాన్ రాయల్స్‌కు ప్లేఆఫ్స్‌లో బెర్తు ఖరారైంది. ఒకవేళ చెన్నై అత్యధిక స్కోరు చేసిన పక్షంలో 170 పరుగుల తేడాతో ఓడితే రాజస్థాన్ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యేవి. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు కేవలం 150 పరుగులు మాత్రమే చేయడంతో ఈ మ్యాచ్‌లో ఓడినా రాజస్థాన్‌కు నష్టమేమీ లేదు. ఇప్పటికే గుజరాత్, లక్నో జట్లు ప్లేఆఫ్స్ చేరగా.. రాజస్థాన్ కూడా వారితో జతకట్టింది. నాలుగో స్థానం కోసం బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య పోటీ నెలకొంది.
