ఈరోజు ఉప్పల్ వేదికగా జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ యాప్‌లో బెట్టింగ్‌లను ముఠా నిర్వహిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇండియా గెలుస్తుందని భారీ స్థాయిలో బెట్టింగ్‌లు పెడుతున్నారని.. ఆసీస్ గెలుస్తుందని రూ.వెయ్యికి రూ.4వేలు బెట్టింగ్ నడుస్తోందని.. ఇండియా టాస్ గెలుస్తుందని బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అటు బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్న 12 మందిని ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.