NTV Telugu Site icon

అశ్విన్‌ సమయం వచ్చేసింది.. వన్డే జట్టులోకి తీసుకోండి..!

అశ్విన్ ‌ను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నారు ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హగ్‌. బంతితో వికెట్లు తీసే అతడు ఆఖర్లో బ్యాటింగ్‌ తో ఆదుకోగలడని సూచించాడు. వన్డేల్లోకి అతడిని తీసుకోవడం కోహ్లీసేనకు ఎంతో మేలు చేస్తుందని చెప్పాడు బ్రాడ్‌. అశ్విన్‌ను వన్డే జట్టులోకి తీసుకోవడం ద్వారా ఆఖర్లో బ్యాటింగ్ సామర్థ్యం పెరుగుతుందన్నాడు. దాంతో టాప్‌ ఆర్డర్లో బ్యాట్స్‌మెన్‌ మరింత దూకుడుగా ఆడతారని తెలిపాడు. అశ్విన్‌ ఎకానమీ సైతం చాలా బాగుందని.. అతడిని జట్టులోకి తీసుకోండిని సూచించాడు బ్రాడ్‌ హగ్‌. అయితే అశ్విన్ 2017 నుండి ఇప్పటివరకు మళ్ళీ వన్డే జట్టులో ఆడలేదు. సెలక్టర్లు అతడిని కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం చేసారు. అయితే ఇప్పుడు టీ 20 సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే జట్టులోకైనా అతడిని తీసుకుంటారా… లేదా అనేది చూడాలి.