ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య పోరు రోజురోజకు రసవత్తరంగా మారుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందుంచింది. మహిపాల్ లామ్రోర్ 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. డుప్లెసిస్ 38, కోహ్లి 30 పరుగులు చేశారు. ఆఖర్లో దినేశ్ కార్తిక్ 17 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులతో రాణించాడు.
సీఎస్‌కే బౌలర్లలో మహీష్ తీక్షణ 3, మొయిన్ అలీ 2, ప్రిటోరియస్ ఒక వికెట్ తీశాడు. 174 పరుగుల లక్ష్యం చేధనకు బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెవన్ కాన్వే 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మొయిన్ అలీ 34 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2, హాజిల్‌వుడ్, షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు.
