ఆసియా జూనియర్ బాక్సిం గ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్స ర్లు పసిడి పతకాల పంట పండించారు. 11 పసిడి పతకాలు గెలిచారు. మొత్తం పురుషుల, మహిళల విభాగాల్లో మొత్తం 11 స్వర్ణాలు, పది రజతాలతో మెరిశారు. పురుషుల కేటగిరీలో నిన్న విశ్వామిత్రా , విశాల్‌లు స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. ఇక ఆదివారం ముగిసిన బౌట్లలో రోహిత్, భరత్‌లు పసిడి నెగ్గారు. అబ్బాయిలకు 4 స్వర్ణాలతో పాటు 7 రజతాలు దక్కాయి. మహిళలలో పది మంది ఫైనల్స్‌కు చేరగా.. వారిలో ఏడుగురు పసిడితో మెరువగా మిగిలిన ముగ్గురు చివరి వరకు పోరాడిన పరాజయం పొంది రజతాలు సాధించారు.
జూనియర్ బాక్సిం గ్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకాల పంట
