తిరుపతి లోక్‌సభ స్థానానికి, నాగార్జున సాగర్ శాసనసభ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ గతికి సూచికలు అవుతాయి. ఈ రెండు కూడా అధికార పార్టీ స్థానాలు కావడం ఇక్కడ ఉమ్మడి అంశం. ఫలితాల సరళిని గురించి మాత్రం భిన్నమైన అంచనాలున్నాయి గనక భావి రాజకీయ విశ్లేషణ కూడా తదనుగుణంగానే ఉంటుంది. తిరుపతిలో అధికార వైఎస్‌ఆర్‌పార్టీ అభ్యర్థి గురుమూర్తికి సమీప ప్రత్యర్థిగా టిడిపి పనబాక లక్ష్మి ఉండగా బిజెపి తరపున రత్న ప్రభ, కాంగ్రెస్ మాజీ ఎంపి చింతామోహన్, సిపిఎం యాదగిరి కూడా పోటీలో ఉన్నారు. ఇక్కడ తమ విజయం ఖాయం గనుక మెజార్టీ మూడు లక్షలు పైన ఉండేట్లు చూసుకోవడమే లక్ష్యమన్నట్టు వైసీపీ ప్రచారం చేసింది. టీడీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉధృతంగా ప్రచారం చేశారు.
వైసీపీ మెజార్టీ తగ్గించి చూపగలిగితే ప్రజల్లో ఆదరణ తగ్గిందని చెప్పవచ్చుననేది టిడిపి వ్యూహంగా ఉంది. తెలంగాణలో దుబ్బాక గెలిచిన తర్వాత అందరికన్నా ముందు తిరుపతిలో సందడి ప్రారంభించిన బిజెపి మొదట హడావుడి చేసినా తర్వాత తగ్గినట్టు కనిపించింది. అక్కడ మతపరమైన అంశాలు ముందుకు వస్తాయని అంచనా వేశారు కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం అంతా మార్చేసింది. ప్రత్యేక హోదా తో సహా ఎపికి సంబంధించిన సమస్యలు ముందుకు రావడంతో బిజెపి ఆత్మరక్షణ స్థితిలో పడిపోయింది. మొదట వస్తారనుకున్న స్టార్ క్యాంపైనర్లు కూడా రాలేదు, ఆఖరులో కొంతవరకూ మత సమస్యలు తీసుకురావడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి గతంలో చాలా సార్లు ప్రాతినిధ్యం వహించిన నేత అయినప్పటికీ తన తరపున బాధ్యత తీసుకుని ప్రచారానికి వచ్చిన నాయకులు దాదాపు లేకపోయారు.
సిపిఎం అభ్యర్థిని సిపిఐ బలపర్చడంతో మొదటి సారి టిడిపికి ఆ పార్టీ మద్దతు లేకుండా పోయింది. వామపక్షాలు బీజేపీ తీరుపై కేంద్రీకరించి ప్రచారం చేశాయి. చివరలో తన ప్రచార సభ పై రాళ్లు పడ్డాయని చంద్రబాబు ఫిర్యాదు చేయడం దాన్ని ఎన్నికల సంఘం వరకూ తీసుకువెళ్లినా పోలీసులు కొట్టిపారేశారు. స్వేచ్ఛాయుత ఎన్నికల వాతావరణం లేదని బీజేపీ ఆరోపించింది, దానికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకరోజు మాత్రమే ప్రచారం చేయగలిగారు.దీనిపై పాలక పార్టీ నేతలు తీవ్రంగానే విరుచుకుపద్డారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రచారానికి వస్తారనుకున్నా చివరలో విరమించుకుని లేఖతో సరిపెట్టారు. మొత్తంపైన తిరుపతి ఉప ఎన్నికలు రాజకీయంగా ఎపిలో చాలా వేడిని రగిలించింది. ఈ ఫలితం తర్వాత వైసీపీ మరింత వూపు పెంచుకుంటుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. టిడిపి శిబిరంలో స్పందన మిశ్రమంగా ఉంది.
తిరుపతితో పోలిస్తే నాగార్జున సాగర్‌లో ప్రచారం లోలోపల ఎక్కువగా నడిచింది. కాంగ్రెస్ అభ్యర్తి జానారెడ్డి అసలు ప్రచారమే లేకుండా ఎన్నికకు వెళదామని ప్రతిపాదించారు. టిఆర్‌ఎస్ తరపున గతంలో మరణించిన ఎంఎల్‌ఎ నోముల నరసింహయ్య కుమారుడు భగత్‌ను నిలబెట్టిన అధికార నేతు అంతకన్నా ముందునుంచి విస్తారంగా ప్రచారం సమీకరణలు చేస్తూ వచ్చారు. బిజెపి అభ్యర్థి రవినాయక్ పోటీలో వున్నా ద్విముఖ పోటీగానే పరిగణించబడిరది, ఎంఎల్‌సి ఎన్నిక ఓటమి తర్వాత వారి ప్రచారం తీరు కూడా పరిమితంగానే నడిచింది. జగన్ తీరుకు భిన్నంగా సాగర్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నిక ప్రకటనకు కొంచెం ముందు ప్రచారం ఆఖరి ఘట్టంలో రెండు పెద్ద బహిరంగ సభ జరిపారు. షరామామూలుగా తెలంగాణ కోసం తాను చేసిన పను ఏకరువు పెట్టి కాంగ్రెస్‌పై నిప్పు కక్కారు.
బీజేపీపై విమర్శలు ఇతర నేతకు వదిలేశారు. జానారెడ్డి గతంలో ఏడుసార్లు ఎంఎల్‌ఎగా పనిచేశారు గనక బమైన పోటీదారుగా ఉంటారనే భావం ఒకవైపు నోముల వారసుడుగా అధికార పార్టీ అండతోనూ భగత్ పోటీ మరోవైపు సాగర్ ఎన్నికను ఉత్కంఠ భరితం చేశాయి. కాంగ్రెస్ భవిష్యత్తు కూడా ఈ ఎన్నిక ఫలితంపై చాలా వరకూ ఆధారపడి వుంటుందనే భావం ఏర్పడిరది. టిఆర్‌ఎస్ గెలిస్తే తమకు తిరుగులేదనే ప్రచారం జోరుగా సాగించేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధంగా వున్నారు. దుబ్బాక జిహెచ్‌ఎంసి వూపును కొనసాగించలేకపోతే బిజెపి జోరు తగ్గుతుందనే అంచనాలు కూడా వున్నాయి, అందుకే అనేక విధాల సాగర్ ఉప ఎన్నిక తెంగాణ రాజకీయాపై ఒక మధ్యంతర అంచనాగా మారనుంది.