Skin Care Basics: మన శరీరంలోని అతిపెద్ద అవయవం చర్మం. చలి, ఎండ, వాన ప్రభావాల నుంచి మనల్ని రక్షిస్తుంది. అందువల్ల చర్మాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం, ప్రాముఖ్యత అందరికీ ఉంది. చర్మ సంరక్షణ, చర్మ సౌందర్యం వంటి పదాలను వినగానే వెంటనే అమ్మాయిలు గుర్తొస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. అబ్బాయిలు సైతం స్కిన్ పట్ల కేర్‌ఫుల్‌గా ఉండాలి. అయితే.. అబ్బాయిలకు స్కిన్ కేరా అని కొందరు ఆశ్చర్యపోతుంటారు. దానివల్ల మాకేంటి ఉపయోగం? అని కూడా అడుగుతుంటారు.
అమ్మాయైనా, అబ్బాయైనా బేసిక్ స్కిన్ కేర్‌ని బ్యూటీ లాగా కాకుండా డ్యూటీ లాగా భావించాలి. ఎందుకంటే.. తీవ్రమైన ఎండలోని అతినీలలోహిత కిరణాల ధాటికి చర్మం కందిపోవటం(సన్ బర్న్), స్కిన్ క్యాన్సర్ తదితర చర్మ వ్యాధులకు దూరంగా ఉండాలంటే స్కిన్‌కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ నేపథ్యంలో అసలు బేసిక్ స్కిన్‌కేర్ అంటే ఏంటి? అందులో ఎన్ని దశలు ఉన్నాయి? అనేవి చూద్దాం. ప్రాథమిక చర్మ సంరక్షణలో ముఖ్యంగా నాలుగు దశలున్నాయి. వాటిని షార్ట్‌కట్‌లో ‘సీటీఎంఎస్ రొటీన్’ అని పేర్కొంటారు.
సీ అంటే క్లెన్సింగ్. దీన్నే ఫేస్ వాష్ అని కూడా అంటారు. టీ అంటే టోనింగ్. దీన్ని రిఫ్రెష్‌మెంట్‌గా చెప్పొచ్చు. ఎం అంటే మాయిశ్చరైజింగ్. ఎస్ అంటే సన్ స్క్రీన్. మన ఫేస్‌లో ఉన్న మేకప్, దుమ్ము వంటివన్నీ పోవాలంటే ముందుగా మనం ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. క్లెన్సింగ్ తర్వాత.. ఫేస్ నుంచి తొలిగిపోయిన న్యాచురల్ ఆయిల్స్, మాయిశ్చరైజర్‌ను తిరిగి పొందటం కోసం టోనింగ్ చేయాలి. తద్వారా మరింత రిఫ్రెష్‌మెంట్ పొందుతాం. అయితే.. ఇది మరీ అంత అవసరంలేదు అనుకున్నవాళ్లు స్కిప్ చేయొచ్చు.
ఇక, మూడో దశ.. మాయిశ్చరైజింగ్. దీనిపైన చాలా మందికి డౌట్లు ఉన్నాయి. ఆల్రెడీ మాది ఆయిల్ స్కిన్ కదా. మాకెందుకు ఈ మాయిశ్చరైజింగ్ అని. కానీ.. ఆయిల్ స్కిన్/డ్రై స్కిన్/కంబైన్డ్ స్కిన్.. ఇందులో ఏ రకమైన స్కిన్ ఉన్నవాళ్లకైనా మాయిశ్చరైజింగ్ అనేది ఎంతో ముఖ్యం. స్కిన్ కేర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటి పరిష్కారం కోసం మాయిశ్చరైజింగ్ చేసుకోవాలి. చివరి దశ.. సన్ స్క్రీన్. ఇందులో.. సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ రేస్, సన్ డ్యామేజ్, హైపో పిగ్మెంటేషన్, ప్రిమెచ్యూరైజింగ్ వంటి వాటిని అరికట్టాలంటే సన్ స్క్రీన్ ఇంపార్టెంట్.
ఈ దశలను ఉదయం చేయాలి. వీటిలో క్లెన్సింగ్ మరియు టోనింగ్‌లను రాత్రి పూట పడుకోబోయే ముందు కూడా ఫాలో అయితే బెటర్. టోనింగ్‌కి చాలా ఎక్కువ సమయం పడుతుందనుకునేవాళ్లు స్కిప్ చేయొచ్చు. కానీ.. మాయిశ్చరైజింగ్ మాత్రం తప్పకుండా ఆచరించాలి. ఇవన్నీ బేసిక్ స్కిన్ కేర్ మాత్రమే. స్కిన్ కేర్‌లో మిగతా దశలు చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలనుకునేవాళ్లు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను ఎన్‌టీవీ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్‌లో చూడొచ్చు.