Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Senior Actress Waheeda Rehman Birthday Special

యేడాదికి రెండు సార్లు… వహిదా రెహమాన్ బర్త్ డే!

Published Date :May 14, 2021 , 5:05 am
By Prakash
యేడాదికి రెండు సార్లు… వహిదా రెహమాన్ బర్త్ డే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఓ నాటి అందాల తార, తరువాతి రోజుల్లో అందాల బామ్మగా, మామ్మగా నటించిన వహిదా రెహమాన్ మన తెలుగునాటనే వెలుగు చూశారు. ఆమె పుట్టినరోజు ఇప్పటికీ చాలామందికి ఏ రోజో తెలియడం లేదట! స్వయంగా వహిదా రెహమాన్ తన పుట్టినరోజు ఫిబ్రవరి 3వ తేదీ, కానీ, చాలా చోట్ల మే 14 అని ఎందుకు ప్రకటిస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఈ విషయమై కొన్ని వెబ్ సైట్స్ కు వహిదా స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పారట. అయినా, ఇప్పటికీ యేడాదికి రెండు సార్లు అంటే ఫిబ్రవరి 3న, మే 14న ఆమెకు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూనే ఉండడం విశేషం. కొన్ని రోజులు వహిదా అలా యేడాదికి రెండు సార్లు అభినందనలు అందుకోవడానికి ఇబ్బంది పడేవారు. ఎంత చెప్పినా, అభిమానులు ఇప్పటికీ ఆమెను అలాగే అభినందిస్తూ ఉండడంతో అది తన భాగ్యం అని అనుకుంటున్నారట.

తెలుగు చిత్రాలతోనే వెలుగు…
వహిదా 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించారు. ఆమె తండ్రి మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ఉద్యోగ రీత్యా తెలుగునేలపైనా ఆయన పనిచేశారు. అలా విశాఖపట్టణంలోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ లో ఆమె చదివారు. చిన్నప్పుడే నాట్యం నేర్చుకున్నారు. వహిదా డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ, తండ్రి మరణంతో ఆమె నృత్యమే ఆమెకు ఎస్సెట్ గా మారింది. యన్టీఆర్ సొంత సంస్థ ఎన్.ఏ.టి. పతాకంపై అప్పటికే ‘పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు’ వంటి అభ్యుదయ చిత్రాలు తీసి నష్టపోయారు. తరువాతి ప్రయత్నంగా ఓ భారీ జానపదం తీయాలని యన్టీఆర్, ఆయన మిత్రులు భావించారు. అందుకు ‘జయసింహ’ కథ సిద్ధం చేసుకున్నారు. అందులో ఓ నాయికగా అంజలీదేవిని ఎంచుకున్నారు. రాజకుమారి పాత్రలో ఓ కొత్త నటిని నటింప చేయాలన్నది యన్టీఆర్, ఆయన దర్శకుడు డి.యోగానంద్ భావన. అలా యన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు, ఆయన మిత్రులు కలసి వహిదా రెహమాన్ గురించి తెలుసుకొని, ఆమెను తమ చిత్రంలో నాయికగా ఎంచుకున్నారు. ఈ లోగా వహిదా రెహమాన్ నృత్యం గురించి తెలుసుకున్న దర్శకుడు తాపీ చాణక్య తమ ‘రోజులు మారాయి’లో కొసరాజు రాసిన “ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా…” సాంగ్ లో నర్తించడానికి వహిదాను ఎంపిక చేసుకున్నారు. అలా వహిదా రెహమాన్ తెరపై తొలిసారి ‘రోజులు మారాయి’లో తళుక్కుమన్నారు. తరువాత నాయికగా ‘జయసింహ’లో జనం మదిని దోచుకున్నారు. ఎమ్జీఆర్, భానుమతి నటించిన రంగుల చిత్రం ‘ఆలీబాబా 40 దొంగలు’లోనూ ఓ నృత్యగీతంలో మురిపించారు వహిదా.

గురుదత్ తో హిందీ చిత్రసీమలో…
హైదరాబాద్ లో ‘రోజులు మారాయి’ వంద రోజుల వేడుక జరిగింది. ఆ సమయంలో వహిదా డాన్స్ చూసిన గురుదత్ ఆమెను హిందీ చిత్రసీమకు పరిచయం చేయాలని నిర్ణయించారు. దేవానంద్ తో తాను తెరకెక్కించిన ‘సి.ఐ.డి.’ చిత్రంతో వహిదా రెహమాన్ ను హిందీ సినిమా రంగానికి పరిచయం చేశారు గురుదత్. వహిదాలోని నటిని గురుదత్ ఎంతగానో ప్రోత్సహించారు. ఆ తరువాత అనేక విజయవంతమైన హిందీ చిత్రాలలో నటించి మెప్పించారు వహిదా రెహమాన్. 1971లో ‘రేష్మా ఔర్ షేరా’ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారు వహిదా రెహమాన్. 1972లో ‘పద్మశ్రీ’, 2011లో ‘పద్మభూషణ్’ అందుకున్నారు వహిదా. తన తొలి హీరో యన్టీఆర్ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అందించే యన్టీఆర్ నేషనల్ అవార్డును 2006లో సొంతం చేసుకున్నారామె. చాలా రోజుల తరువాత ‘రోజులు మారాయి’ హీరో అక్కినేని నటించిన ‘బంగారు కలలు’లో ఆయనకు సోదరిగా నటించారు వహిదా. ఆ తరువాత 1986లో కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన ‘సింహాసనం’లో వహిదా రాజమాతగా అభినయించారు. 2006లో సిద్ధార్థ్ హీరోగా రూపొందిన ‘చుక్కల్లో చంద్రుడు’లో ఏయన్నార్ తో కలసి నటించారామె.

వహిదా రెహమాన్ ను గురుదత్ ఎంతగానో ప్రేమించారు. అయితే, అప్పటికే ఆయనకు వివాహమయింది. ఆ తరువాత గురుదత్ అర్ధాంతరంగా జీవితం చాలించారు. తనతో ‘షగున్’లో హీరోగా నటించిన కమల్ జీత్ ను 1974లో వివాహమాడారు వహిదా రెహమాన్. వారికి ఇద్దరు పిల్లలు. 83 ఏళ్ళు నిండినా ఇప్పటికీ హుషారుగా ఉండే వహిదా రెహమాన్, తన తరం తారలయిన ఆషా పరేఖ్, హెలెన్ తో కలసి ‘దిల్ చాహ్ తా హై’ అంటూ అండమాన్, నికోబార్ దీవుల్లో బోటింగ్ చేసిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Waheeda Rehman

తాజావార్తలు

  • Prabhas: ఆల్ ఆన్ ట్రాక్.. ‘సలార్ 2’ ఒక్కటే డిసప్పాయింట్!

  • Markapur Accident: మార్కాపురం రోడ్డు ప్రమాదం… 14కు చేరిన మృతుల సంఖ్య.. మృతుల వివరాలు ఇవే..!

  • Srinu Vaitla: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా: కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు!

  • Iran-Israel: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. కీలక కమాండర్ హతం

  • Megastar: రామ్ చరణ్‌ కంటికి సర్జరీ.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

ట్రెండింగ్‌

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions