Site icon NTV Telugu

Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

Human Saliva

Human Saliva

Human Saliva: సాధారణంగా తీవ్రమైన నొప్పిని తగ్గించడానికి వైద్యులు ‘మార్ఫిన్’ వంటి శక్తివంతమైన మందులను వాడుతుంటారు. అయితే, వీటికి అలవాటు పడితే ప్రాణాపాయం లేదా వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. కానీ, వీటన్నింటికీ విరుగుడుగా మన శరీరమే ఒక సహజమైన ‘పెయిన్ కిల్లర్’ను ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నొప్పిని తగ్గించడంలో అత్యంత శక్తివంతమైన ‘మార్ఫిన్’ కంటే ఆరు రెట్లు వేగంగా పనిచేసే ఆ పదార్థం పేరు ‘ఓపియోర్ఫిన్’. దాని కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

ఓపియోర్ఫిన్ ఎలా పనిచేస్తుంది..
ఓపియోర్ఫిన్ అనేది మన లాలాజలంలో సహజంగా ఉండే ఒక రసాయనం. మనం ఆహారం నమిలినప్పుడు, మాట్లాడినప్పుడు లేదా మింగినప్పుడు ఇది స్వల్ప పరిమాణంలో విడుదలవుతుంది. ఇది మెదడుపై నేరుగా ప్రభావం చూపదు. మన శరీరంలో నొప్పిని తగ్గించే ‘ఎంకెఫాలిన్స్’ అనే సహజ రసాయనాలు ఉంటాయి. ఇవి సాధారణంగా త్వరగా విచ్ఛిన్నమైపోతాయి. ఓపియోర్ఫిన్ ఈ ‘ఎంకెఫాలిన్స్’ విచ్ఛిన్నం కాకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల మన శరీరంలోని సహజ నొప్పి నివారణ వ్యవస్థ ఎక్కువ కాలం పనిచేసి, నొప్పిని త్వరగా తగ్గిస్తుందని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధనల ప్రకారం.. నొప్పిని అదుపు చేయడంలో ఓపియోర్ఫిన్, మార్ఫిన్ కంటే 6 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడైంది. సాధారణ పెయిన్ కిల్లర్స్ వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కానీ దీనివల్ల అలాంటి ముప్పు ఉండదు. కృత్రిమ మందులకు బానిసలైనట్లుగా, ఈ సహజ రసాయనానికి బానిసయ్యే అవకాశం అస్సలు లేదు. ఇది శరీరంలోని సొంత వ్యవస్థనే బలపరుస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు పెయిన్ కిల్లర్స్‌కు బానిసలై ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఓపియోర్ఫిన్‌ను శాస్త్రవేత్తలు ఒక వరంలా భావిస్తున్నారు. ఈ సహజ అణువును పోలిన కృత్రిమ మందులను తయారు చేసేందుకు ల్యాబ్‌లలో ఇప్పటికే ప్రయోగాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఎటువంటి దుష్ప్రభావాలు లేని ‘న్యూ జనరేషన్’ పెయిన్ కిల్లర్స్ అందుబాటులోకి రావడానికి ఇది మార్గం సుగమం చేయనుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి మన శరీరంలోనే ఎన్నో అద్భుతమైన వనరులను నిక్షిప్తం చేసిందని, మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనుల ద్వారానే (నమలడం, మాట్లాడటం) ఈ శక్తివంతమైన ఓపియోర్ఫిన్ విడుదలవుతూ మనల్ని నొప్పి నుంచి కాపాడుతోందన్నారు. మన లోపల ఇంతటి శక్తివంతమైన మెకానిజం ఉందని తెలియడం నిజంగా ఆశ్చర్యకరమే..

READ ALSO: Vedanta Demerger: బంపర్ ఆఫర్.. ఈ ఒక్క షేరు ఉంటే.. ఆరు షేర్లు మీ సొంతం!

Exit mobile version