NTV Telugu Site icon

We Love Bad Boys Review: ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ మూవీ రివ్యూ

We Love Badboys Shooting

We Love Badboys Shooting

We Love Bad Boys Movie Review: బిగ్ బాస్ అజయ్ కతుర్వార్, వంశీ ఏక సిరి, ఆదిత్య శశాంక్, రొమికా శర్మ, రోషిణి సహోత, ప్రగ్యా నయన్ ముఖ్య పాత్రల్లో నటించిన మూవీ ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’. పోసానీ కృష్ణ మురళీ, కాశీ విశ్వనాథ్, అలీ, సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, శివా రెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను బీఎం క్రియేషన్స్ బ్యానర్ మీద పప్పుల కనకదుర్గా రావు నిర్మించారు. ఇక రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 8న థియేటర్లలోకి వచ్చేసింది. అవుట్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ వి లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ
ప్రశాంత్ (అజయ్ కతుర్వార్), వినయ్ (వంశీ యాకసిరి), అరుణ్ (ఆదిత్య శశాంక్) బెస్ట్ ఫ్రెండ్స్, ముగ్గురూ ఒకే రూమ్ లో ఉంటారు. ఇక మరోపక్క దివ్య (రోమికా శర్మ), రమ్య (రోషిణి సహోతా) మరియు పూజ (ప్రజ్ఞా నయన్) అక్కాచెల్లెళ్లు. ఈ ముగ్గురు అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ముగ్గురబ్బాయిలతో ప్రేమలో పడతారు. దివ్య ప్రశాంత్‌తో, రమ్య వినయ్‌తో, పూజ అరుణ్‌లతో ప్రేమలో పడగా అమ్మాయిల తండ్రి (పోసాని కృష్ణ మురళి) వారిష్టపడ్డ వారితోనే వివాహం చేయాలని అనుకుంటాడు. అరుణ్ పెళ్ళికి సిద్ధమైనా ప్రశాంత్, వినయ్ తమ ప్రియురాళ్లను పెళ్లి చేసుకునేందుకు వెనుకాడతారు. అయితే వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి వెనుకాడారు? అంతలా వారి మధ్య ఏం జరిగింది? వీరి ప్రేమ కథకు ఎలాంటి ముగింపు వచ్చింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ
నేటి యవత ఎక్కువగా కంటెంట్ ఉన్న సినిమాలు తో పాటు కామెడీ సినిమాలు అదేవిధంగా రొమాంటిక్ కామెడీ సినిమాలకు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. దాన్నే ప్రధాన అంశంగా తీసుకుని సినిమా దర్శకుడు ఈ సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా ఎంటర్టైన్ చేసే విధంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆహ్లాదకరంగా, వినోదభరితంగా రాసుకున్నాడు డైరెక్టర్. అదే సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా రాసుకుని ఒకపక్క నవ్విస్తూనే యూత్‌తో పాటు పేరెంట్స్‌కి ఇచ్చిన సందేశం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే సినిమా కాస్త లాగ్ అనిపిస్తుంది. ట్రిమ్ చేసే విషయంలో ఫోకస్ పెడితే బాగుండేది.

నటీనటుల అంశానికి వస్తే అజయ్, వంశీ, ఆదిత్య అందరూ తమ తమ పాత్రలకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. రోమికా శర్మ అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండగా రోషిణి సహోతా, ప్రగ్యా నయన్ తెరపై అందంగా కనిపిస్తూ నటనతోనూ మెప్పించారు. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, కాశీ విశ్వనాథ్, అలీ, సప్తగిరి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, శివారెడ్డి తదితరులు ప్రేక్షకులను నవ్వించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రఘు కుంచె పాటలు బాగున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. లొకేషన్‌లు బాగున్నాయి, విజువల్స్ అందంగా కనిపించేలా కెమెరా పనితనం కనిపించింది. నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి.

ఓవరాల్ గా: ఈ వి లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్.యూత్ కి కనెక్ట్ అవుతుంది.

Show comments