NTV Telugu Site icon

Chaari 111 Review: వెన్నెల కిశోర్‌ ‘చారి 111’ రివ్యూ

Chaari 111

Chaari 111

Chaari 111 Movie Review: కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసిన వెన్నెల కిషోర్ హీరోగా మారి సినిమా అనౌన్స్ చేయగానే అందరిలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గతంలో కూడా ఇలానే ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా మారి సత్తా చాటారు. చారి 111 అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త విశ్వనాధ్ హీరోయిన్ గా నటించింది. మళ్ళీ రావా డైరెక్టర్ కీర్తి కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం పదండి.

కథ:
తెలంగాణ ముఖ్యమంత్రి(శుభలేఖ సుధాకర్) ఆదేశాలతో రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెంట్‌ సర్వీస్‌ మాజీ మిలిటరీ మేయర్ ప్రసాద్‌ రావు(మురళీశర్మ) సారథ్యంలో నడుస్తుంది. ఇక తరువాత సీఎం(రాహుల్‌ రవీంద్రన్‌)కూడా తన తండ్రి బాటలోనే రుద్రనేత్రకి సీరియస్ కేసులు అప్పగిస్తూ ఉంటాడు. ఇక హైదరాబాదులో మానవ బాంబులు కలకలం సృష్టించగా మిగతా ఏజెంట్లు ఎవరూ లేక సస్పెన్షన్ లో ఉన్న చారి 111(వెన్నెల కిశోర్‌)కి ఈ కేసు అప్పగిస్తారు. ఇక తన అసిస్టెంట్(తాగుబోతు రమేష్‌)తో కలిసి జేమ్స్ బాండ్‌ తరహాలో కేసు క్రాక్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ బ్లాస్టింగ్‌లో అనుమానితుడైన బిగ్‌ షాట్‌ శ్రీనివాసరావు(బ్రహ్మాజీ)ని చారి 111 పట్టుకోవడానికి ప్రయత్నిస్తే చారి చేతకానితనతో మిస్ అవుతాడు. అయితే ప్రసాద్‌ రావు ప్లాన్‌ బీ కారణంగా వాళ్ల వద్ద నుంచి సూట్‌కేస్‌ దొంగతనం చేస్తారు. అది ఓపెన్ చేశాక ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అయితే అసలు అలా తెలిసిన నిజం ఏంటి? ఈ మిషన్‌లో ఏజెంట్ ఈషా (సంయుక్త) పాత్ర ఏంటి? అసలు ఈ బ్లాస్ట్ ఎలా చేస్తున్నారు? అసలు రావణ్‌ ఎవరు? ఈ హ్యూమన్‌ బాంబ్‌ని తయారు చేసింది ఎవరు? ఈ కేసుని చారి 111 ఛేదించాడా? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
కమెడియన్లు హీరోలుగా మారి సినిమాలు చేసినప్పుడు సీరియస్‌ సబ్జెక్ట్ లు చేస్తే ఆడియన్స్ కి ఎక్కదు. వారి నుంచి కామెడీ ఎక్స్ పెక్ట్ చేస్తారు. చారి 111` సినిమా విషయంలో కూడా దర్శకుడు ఇదే విషయాన్ని ఫాలో అయ్యాడు. సినిమా చాలా సీరియస్ సబ్జెక్ట్ అయినా వినోదాత్మకంగా చూపించాడు. సూటిగా సుత్తి లేకుండా కథలోకి తీసుకెళ్లాడు. అయితే సినిమా నడుస్తున్నంత సేపు వెన్నెల కిషోర్ చారి పాత్రను చూస్తే `చార్లీ చాప్లిన్‌` స్టయిల్‌ని, అలాగే `పింక్‌ పాంథర్‌` తరహా కామెడీ స్టయిల్‌ని అనుకరిచినట్టు అనిపిస్తుంది. మొదటి భాగం అంతా అలానే నడిపించి సెకండాఫ్‌లో మాత్రం సీరియస్‌గా మారిపోయి విలన్‌ ఎంటర్‌ అయ్యాక వచ్చే ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ కన్విన్సింగ్‌ అనిపించ లేదు. క్లైమాక్స్ లో ఏదో అవుద్ది అనుకుంటే మమ అనిపించారు. వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్ ను పట్టుకుని హిలేరియస్‌ ఫన్‌ చేయించకుండా సీరియస్ నోట్ లోకి వెళ్లడం కొంత మైనస్. ఇక హీరోయిన్‌ చేసే యాక్షన్‌ సీన్‌ ఫస్టాఫ్‌కి హైలెట్‌.

నటీనటుల విషయానికి వస్తే చారి పాత్రలో వెన్నెల కిశోర్‌ సరిగ్గా సెట్ అయ్యాడు. ఎప్పటిలాగే కామెడీతో అలరించాడు. హీరో అనే ఫీలింగ్‌ రానివ్వకుండా సినిమాలో హీరోయిన్‌ చేత ఒక డైలాగ్ చెప్పించినట్టుగా హీరోగా చేసినా చూడ్డానికి కమెడియన్‌గానే కనిపించాడు. ఇక ఇక హీరోయిన్‌ గా సంయుక్త విశ్వనాథన్‌ అదరగొట్టింది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్లో రచ్చరేపింది. రుద్రనేత్ర ఛీఫ్‌గా మురళీశర్మ, సీఎంలుగా శుభలేఖ సుధాకర్, రాహుల్‌ రవీంద్రన్‌ లు హుందాగా కనిపించారు. తాగుబోతు రమేష్‌, సత్యల కామెడీ కొన్ని సీన్స్ లో బాగా వర్కవుట్ అయింది. ఇక టెక్నీకల్ విషయంలో కూడా సినిమా ఆకట్టుకుంది. సైమన్ కె కింగ్ పాటలు కొన్ని బాగున్నా నేపథ్య సంగీతం బాగా సెట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్‌ లుక్ తెచ్చింది. ఎడిటింగ్ కూడా సెట్ అయింది. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయ్.

ఫైనల్ గా : చిన్న చిన్న లోపాల సంగతి పక్కన పెట్టి ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే చారి 111 నవ్విస్తుంది.

Show comments