NTV Telugu Site icon

Theppa Samudram Review: బిగ్ బాస్ అర్జున్ ‘తెప్ప సముద్రం’ మూవీ రివ్యూ

Theppa Samudram Review

Theppa Samudram Review

Theppa Samudram Movie Review: అర్జున్ అంబటి గతంలో హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. సీరియల్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత బిగ్ బాస్ అర్జున్ అంబటిగా మారిపోయిన ఆయన హీరోగా కొరమీను సినిమాలో హీరోయిన్గా నటించిన కిషోరి హీరోయిన్గా ఇప్పుడు తెప్ప సముద్రం అనే సినిమా తెరకెక్కింది. వరస సినిమాలతో దూసుకుపోతున్న యువ హీరో చైతన్య రావు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించడం విశేషం. సతీష్ రాపోలు దర్శకత్వం వహించిన ఈ సినిమాని బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ నిర్మించారు. గతంలో తెలంగాణలో వెలుగులోకి వచ్చిన వరుస బాలికల మిస్సింగ్ కేసుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టీజర్, ట్రైలర్ ద్వారా కొంత క్లారిటీ వచ్చేసింది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందని ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులు అంచనాలను ఎంతవరకు అందుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం.

తెప్ప సముద్రం కథ:
తెలంగాణాలోని తెప్ప సముద్రం అనే ఊళ్లో విజయ్ (అర్జున్ అంబటి) ఆటో డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. అదే ఊరిలో టీచర్ గారి అమ్మాయి ఇందు(కిషోరి) నీ వన్ సైడ్ లవ్ చేస్తూ ఎప్పటికైనా ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అదే ఊరిలో వయసుకు వచ్చిన ఆడపిల్లలు వరుసగా మిస్ అవుతూ ఉంటారు. ఆ వరుస ఆడపిల్లల మిస్సింగ్ కేసును చేదించడం కోసమే అదే ఊరికి చెందిన గణేష్ (చైతన్య రావు) అక్కడ ఎస్సైగా పోస్టింగ్ తీసుకుంటాడు. విజయ్ బంధువుల పాప కూడా మిస్ కావడంతో అతను కూడా ఈ మిస్సింగ్ కేసుల వెనక ఎవరున్నారు అని తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడతాడు. అయితే ఈ మిస్సింగ్ కేసుల కోసం అందరూ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఒక షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. అది ఏమిటి? తప్పి పోయిన చిన్నారులు అందరూ ఏమయ్యారు? అనే విషయం తెలియాలంటే సినిమా మొత్తం బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
కొన్నాళ్ల క్రితం తెలంగాణలోని హాజీపూర్ బొమ్మలరామారం అనే గ్రామంలో వరుసగా ఆడపిల్లలు మిస్ అవుతూ వచ్చారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఎందుకు అదే మిస్సింగ్ కేసులు ఙ్ఞప్తికి వచ్చాయి. అయితే సినిమా చూసిన తర్వాత ఆ కేసుల నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న వేరే కథగా క్లారిటీ వచ్చింది. ఓ ఊరు, ఆ ఊళ్లో వయసుకొచ్చిన చిన్నారులపై దారుణంగా అత్యాచాలకు పాల్పడే సైకో, చివరకు అతనిని కనుగొని ఈ వరుస దారుణాలను ఎలా ఆట కట్టించారు అనే విషయాన్ని ప్రేక్షకుల ముందుకు ఆసక్తికరంగా తీసుకురావడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సాధారణంగా తెలుగు ప్రేక్షకులు చాలా తెలివైనవాళ్లు, అయితే వాళ్ల మెదడులకు పని పెడుతూ చివరి వరకు అసలు హంతకుడు ఎవరనేది ప్రేక్షకులు ఓ పట్టాన కూడా అర్థమవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాని ముందుకు తీసుకువెళ్లే విషయంలో దర్శకుడు సఫలమయ్యాడు. హీరో హీరోయిన్ల ప్రేమ విషయం కాస్త బోరింగ్ అనిపించినా ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాడు డైరక్టర్.. ఇక సెకండ్ హాఫ్ లో కూడా భారీగా ట్విస్టులు రాసుకుని ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సతీష్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. తాను చెప్పాలనుకున్న కథని ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసే విధంగా చెప్పడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యాడు.

నటీనటుల విషయానికి వస్తే చక్కగా చదువుకున్న అమ్మాయిని ప్రేమలో పడేసి ఎందుకు ప్రయత్నాలు చేసే ఆటోడ్రైవర్ గా విజయ్ పాత్రలో అర్జున్ అంబటి ఆకట్టుకున్నాడు. నటన విషయంలో భలే ఈజ్ కనిపించింది. హీరోయిన్ కిశోరి దాత్రిక్ కూడా మెప్పించింది. ఇందులో విలన్ పాత్రలో గజాగా నటించిన చైతన్య దాత్రిక్ కూడా విలనిజం పండించాడు.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చైతన్య రియల్ కుమార్తె కిషోరి. హీరోగా వర్షం సినిమాలో చేస్తున్న చైతన్య రావు ఇందులో కీలకమైన పాత్రలో నటించి ఒక స్వీట్ షాక్ ఇచ్చాడు. తండ్రి పాత్రలో రవిశంకర్… లాయర్ విశ్వనాథ్ గా చాలా బరువైన పాత్రను పోషించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మిగతా వారంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సతీష్ రాపోలు కథనం ఆడియన్స్ ను మెప్పిస్తుంది. సినిమాటోగ్రీఫి విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరే లెవెల్ లో ఉండేది. సంగీతం మాస్ ను బాగా ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే ఈ తెప్ప సముద్రం సినిమా ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్. ఆ జానర్ సినిమాలు ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.

Show comments