NTV Telugu Site icon

Yamadheera Review: యమధీర రివ్యూ

Yamadheera

Yamadheera

Yamadheera Movie Review: ఒకప్పుడు క్రికెటర్ గా ఆకట్టుకున్న శ్రీశాంత్ ఇప్పుడు నటుడిగా మారాడు. పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పుడు యమధీర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడలో కెంపెగౌడ 2 అనే పేరుతో వచ్చి ఆకట్టుకున్న సినిమాను యమధీర పేరుతో డబ్ చేసి ఈరోజు రిలీజ్ చేశారు. సరిగ్గా ఎన్నికల ముందే ఈవీయం ట్యాంపరింగ్ బేస్డ్ కథతో వస్తున్నట్టు టీజర్, ట్రైలర్ లతో క్లారిటీ ఇవ్వడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఇక ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ సినిమా రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే :
గౌతమ్ ( కోమల్ కుమార్) ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్. దీంతో అనేక మార్లు ట్రాన్స్ఫర్ అవుతూ వైజాగ్ కమిషనర్ గా నియమితుడవుతాడు. అక్కడ ఒక మిస్టరీ డెత్ కేసు రీ ఓపెన్ చేసి పరిష్కరించే క్రమంలో అజర్ బైజాన్ దేశంలో ఉన్న దేశముఖ్ (క్రికెటర్ శ్రీశాంత్) ఆ హత్యకి కారణమని గుర్తిస్తాడు. అయితే ఆ హత్య కేసులో అతన్ని శిక్షించాలని భావించిన తరుణంలోనే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయించి దేశముఖ్ ఏకంగా రాష్ట్రానికి సీఎం అవుతాడు. ఈ క్రమంలో గౌతమ్ ఏమి చేశాడు?దేశముఖ్ కి ఆ యువకుడు హత్యకి ఉన్న లింకు ఏంటి? ఒక సిటీ కమిషనర్ సీఎం హోదాలో ఉన్న దేశముఖ్ ను ఎలా శిక్షించేలా చేశాడు? అనే విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయచ్చా? అలా అయితే ఎండలో గంటలు తరబడి నిలబడి ఓట్లు వేసే సమానీయుల విలువైన ఓటుకు విలువేది? అని ఎన్నో రకాల డిబేట్స్ మనం వింటూనే ఉంటాం. దాదాపుఅదే లైన్ తీసుకుని తెర మీద చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్. కమర్షియల్ యాంగిల్ లోనే ఆ అంశాల మీద గురించి జనానికి అవగాహన కల్పించేలా ఈ సినిమా తెరకెక్కించారు. కథగా చూస్తే ఇందులో కొత్తగా ఏమి ఉండదు కానీ ఒక ఆలోచింపచేసే సందేశాన్ని కమర్షియల్‌ అంశాలను జోడించి ప్రేక్షకులను ఆలోచింప చేసే ప్రయత్నం చేశారు. చక్కగా చూపించారు. కన్నడ సినిమా అయినా అచ్చమైన తెలుగు సినిమా మాదిరి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాని డబ్ చేశారు. సరిగ్గా ఎలక్షన్స్ ముందే ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ఈ సినిమాలో చర్చించడం ఆసక్తికరం. ఇక ఫస్టాఫ్‌లో సాగదీత సన్నివేశాలు ఎక్కువయి, శ్రీశాంత్‌ పాత్ర నిడివి తక్కువ ఉండడం సినిమాకు కొంత ఇబ్బందికరమే. అయితే ఆయన నిడివి పెంచి, స్క్రిప్ట్‌ని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎవరు ఎలా చేశారంటే :
కన్నడ నాట కమెడియన్ గా సుపరిచితుడు అయిన కోమల్ కుమార్ హీరోగా సత్తా చాటాడు. ఒకరకంగా నిజాయితీగల పోలీసు అధికారిగా చెలరేగి నటించాడు. ఇక నెగిటివ్ రోల్ లో క్రికెటర్ శ్రీశాంత్ కూడా ఫుల్ డామినేట్ చేశారు. ఇక హీరోయిన్ రిషిక శర్మ తన పరిధి మేరకు ఆకట్టుకుంది. ఇక పోలీసు అధికారిగా నాగబాబు నటన, మూగ వ్యక్తి పాత్రలో ఆలీ పండించిన కామెడీ చాలా బాగుంది. మధుసూదన్ రావు, సత్య ప్రకాష్, పృథ్వీరాజ్ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే శ్రీ మందిరం ప్రొడక్షన్స్ వేదాల శ్రీనివాసరావు ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. డిఓపిగా రోష్ మోహన్ కార్తీక్ పనితీరు ఆకట్టుకుంటుంది. వరుణ్ ఉన్ని అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ఇక ఎడిటర్ కొంచెం క్రిస్పీగా కట్ చేసుకుని ఉంటే బాగుండేది.

ఫైనల్లీ: యాక్షన్ లవర్స్ కోసం రెడీ చేసిన ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్ యమధీర.. ఈవీఎంల అంశం బోనస్.

Show comments